Aishwarya Rai Bachchan Cannes :ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. భారత్ నుంచి కూడా పలువురు స్టార్స్ కూడా రెడ్ కార్పెట్పా తళుక్కుమన్నారు. దీంతో ఆ వేడుకపై అభిమానుల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఎప్పుడూ ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఈ సారి కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
అయితే తాజాగా ఆమె తన కుమార్తె ఆరధ్యతో కలిసి కేన్స్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు బయలుదేరింది. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మెరిసింది. కేన్స్ ఫెస్టివల్ అయితే ఐశ్వర్య చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించింది. దీంతో ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్వెల్ సూన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గాయంతోనూ కేన్స్ వస్తున్న ఆమె పట్టుదలను కొనియాడుతున్నారు.
ఇక ఐష్ ప్రతి ఏడాది కేన్స్‌లో తళుక్కున మెరుస్తుంటారు. విభిన్నమైన కాస్ట్యూమ్స్‌తో కనిపించి అలరిస్తారు. దీంతో ఈ సారి ఆమె ఎటువంటి కాస్ట్యూమ్‌లో రానుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ అభిమానులను నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు ఆమెను చూసిన తర్వాత ఆమె ఎలా కనిపిస్తారో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గాయంతో ఆమె ఈ వేడుకకు హాజరవ్వగలదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.