Adivi Sesh Relationship Director Rahul Ravindran : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి క్షణం చిత్రంతో హీరోగా మారారు అడివిశేష్. అప్పటి నుంచి భిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా హిట్లను అందుకుంటూ ముందుకెళ్తున్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు కొన్ని సినిమాలకు కథలను కూడా అందిస్తూ మల్టీ టాలెంట్‌తో ముందుకు వెళ్తున్నారు.
ప్రస్తుతానికి టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరోలలో అడివి శేష్ ఒకరు. ప్రొఫెషనల్ కెరీర్లో దూసుకెళ్తున్నప్పటికీ పర్సనల్ లైఫ్‌లో ఇంకా ఓ ఇంటి వాడు కాలేదు. అయితే ఈయన రిలేషన్షిప్లో ఉన్నారంటూ చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని ఎప్పుడూ అఫీషియల్‌గా చెప్పలేదు. అయితే ఆయన తాజాగా ఓ టాక్ షోలో గెస్ట్‌గా పాల్గొని సందడి చేశారు. దీనికి మెగా డాటర్‌గా పేరు సంపాదించుకున్న నిహారిక హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అదే ఆహా చెఫ్ మంత్రా. ఈ షోకు అడివి శేష్‌తో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా హాజరై సందడి చేశారు.
తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో నిహారిక మాట్లాడుతూ 'ఎయిట్ తర్వాత వస్తుంది 9, మా శేష్ సింగిల్ కాబట్టి అమ్మాయిలు వేసుకోవచ్చు లైన్' అంటూ ఒక పంచ్ డైలాగ్ వేసి నవ్వించింది. అయితే దీనికి వెంటనే రాహుల్ రవీంద్రన్ రియాక్ట్ అయ్యారు. 'అడివి శేష్ సింగిల్ అని ఎవరు చెప్పారు' అంటూ ఒక్కసారిగా సడెన్ షాక్ ఇచ్చారు. దీంతో అడివి శేష్ లవ్ స్టోరీ ఏమైనా ఉందా అని పక్కన ఉన్నవారికి ఆలోచించే లోగా రాహుల్ మళ్లీ తన మాటలను కవర్ చేశారు. 'శేష్ సింగిల్ కాదు మల్టిపుల్' అంటూ మరో కౌంటర్ వేశారు. ఆద్యంతం మూడు నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో నవ్వులు పూయిస్తూ ఆసక్తికరంగా సాగింది.