తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'డైరెక్టర్​ను అందుకే మార్చాం - ఇది శేష్​ నిర్ణయం కూడా' - Adivi Sesh G2 Movie Director - ADIVI SESH G2 MOVIE DIRECTOR

Adivi Sesh G2 Movie : టాలీవుడ్ స్టార్ హీరో అడివి శేష్ లీడ్​ రోల్​లో నటిస్తున్న 'గూఢచారి 2' సినిమాకు డైరెక్టర్ మారారు. కారణం ఏంటంటే?

Adivi Sesh G2 Movie
Adivi Sesh G2 Movie (Source : Getty Images)

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 12:41 PM IST

Adivi Sesh G2 Movie :యంగ్ హీరో అడివి శేష్​ లీడ్​ రోల్​లో వచ్చిన 'గూఢచారి' ఎంతటి సూపర్ సక్సెస్​ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ అందుకోవడమే కాకుండా శేష్​కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఈ స్టార్ హీరో కూడా ఇటువంటి జానర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా వస్తున్న గూఢచారి-2 మూవీ లవర్స్​లో అంచనాలు పెంచేసింది.ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ వీడియో, స్పెషల్ పోస్టర్స్​లో శేష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది.

అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ మారారు. తొలుత శశి కిరణ్​ తిక్కా ఈ సినిమాను రూపొందిస్తుండగా, ఇప్పుడు ఆయన ప్లేస్​లో వినయ కుమార్ డైరెక్టర్​గా వ్యవహరించనున్నారు. ఇది విన్న ఫ్యాన్స్​ ఒకింత షాకయ్యారు. అయితే తాజాగా శశి కిరణ్​ ఓ ఇంటర్వ్యూలో ఈ మార్పుకు కారణాన్ని వెల్లడించారు.

శశి కిరణ్​ ప్రస్తుతం ' సత్యభామ' సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆ చిత్ర ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

"ఈ విషయంపై నేను, శేష్ చర్చించి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాం. వినయ్ కుమార్ 'గూఢచారి', 'మేజర్' వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశారు. ఈ సినిమాల గురించి వినయ్​కు బాగా పరిచయం. అర్థరాత్రి నిద్ర లేపి అడిగినా గూఢచారికి సంబంధించిన అన్ని విషయాలు వెంటనే చెప్పగలడు. ఈ మూవీని తను డైరెక్ట్ చేయడమే సరైన ఛాయిస్ అందుకే వినయ్ కుమార్​కు ఈ సీక్వెల్ డైరెక్షన్ బాధ్యత అప్పగించాం. అంతేకాదు నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఒక ఫిల్మ్ డైరెక్షన్​లో బిజీగా ఉన్నాను. సత్యభామ మూవీ ప్రొడక్షన్ బాధ్యత కూడా నాపైన ఉంది" అని చెప్పారు శశి కిరణ్.

ఇక జీ2లో శేష్ సరసన బనిత సంధు నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫాక్టరీ బ్యానర్ కింద విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఇక చిత్రం మొదటి భాగాన్ని కొనసాగించే కథతో వస్తుందని మేకర్స్ ముందే ప్రకటించారు. కాకపోతే మొదటి భాగంలో స్పైగా ట్రైనింగ్ అయిన శేష్ రెండో భాగంలో విదేశాల్లో దేశం కోసం పోరాడతాడు. ఇంకా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ఏడాది ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం ఉందని సమాచారం.

టాలీవుడ్ నెక్ట్స్​ సెంచరీ కొట్టే హీరో అతడేనా? - Tollywood Tier 2 Heroes

శత్రువులుగా మారిన ప్రేమికులు- అడివి శేష్ 'డెకాయిట్' టీజర్​ రిలీజ్

ABOUT THE AUTHOR

...view details