తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

తన వల్లే ప్రేమపై నమ్మకం కలిగింది : అదితి - Aditi Siddharth Engagement - ADITI SIDDHARTH ENGAGEMENT

Aditi Siddharth Engagement : స్టార్ హీరోయిన్ అదితిరావ్ హైదరీ తన ఎంగేజ్​మెంట్​ గురించి అలాగే హీరో సిద్ధార్థ్​తో తనకున్న రిలేషన్​షిప్​ గురించి ఓపెన్ అప్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

Aditi Rao Hydari
Aditi Rao Hydari (Source : ETV Bharat Archives)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 3:43 PM IST

Aditi Siddharth Engagement :స్టార్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ, సిద్ధార్థ్​ లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా తమ ప్రేమను ఎక్కడా బయటపెట్టని ఈ జంట రీసెంట్​గా ఎంగేజ్​మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. అంతకుముందు ఎన్నో సార్లు కెమెరా కంటికి చిక్కినప్పటికీ తాము స్నేహితులమే అంటూ రూమర్స్​ను కొట్టిపారేశారు. అయితే తాజాగానటి అదితిరావ్‌ సిద్ధార్థ్​ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తమ రిలేషన్​షిప్​ గురించి ఓపెన్​అప్ అయ్యారు. సిద్ధార్థ్‌ వల్లే తనకు ప్రేమపై నమ్మకం పెరిగిందంటూ చెప్పుకొచ్చారు.

"సిద్ధార్థ్‌ నన్నెంతో మార్చాడు. తను పరిచయమయ్యాకే నాకు ప్రేమపై మరింత నమ్మకం పెరిగింది. ఎన్నో విషయాల్లో ఆ నమ్మకం నిజమైంది. మా ఇద్దరిది చిన్నపిల్లల మనస్తత్వం. ప్రేమ ఉన్న చోట గౌరవం తప్పకుండా ఉంటుంది. మేమిద్దరం కూడా ఒకరినొకరం ఎంతో గౌరవించుకుంటాం. ప్రతి విషయాన్ని నేను పాజిటివ్‌గా తీసుకుంటాను. యాక్టర్స్​పై రూమర్స్‌ రావడం సహజమే. మా ఇద్దరిపై కూడా ఎన్నో గాసిప్స్‌ వచ్చాయి. వాటన్నింటికీ చెక్‌ పెట్టేందుకే మేము ఎంగేజ్​మెంట్​ విషయాన్ని మీడియాకు వెల్లడించాం. ఆ విషయాన్ని తెలుసుకున్న వారు సంతోషించి మాకు విషెస్ చెప్పారు. వాళ్లందరికీ ధన్యవాదాలు. వాళ్ల అభిమానం మా ఇద్దరికీ ఎంతో విలువైనది" అంటూ తమ ఎంగేజ్​మెంట్ గురించి చెప్పారు.

మరోవైపు సోషల్‌ మీడియా గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. "సెలబ్రిటీలు కూడా మనుషులే అనే విషయాన్ని ప్రజలు గ్రహించాలి. వాళ్ల చుట్టూ తిరిగి వాళ్ల పర్సెనల్ విషయాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకోవడం తప్పు అని తెలుసుకోవాలి. వారి ప్రైవసీకి భంగం కలిగించకూడదని నెటిజన్లు భావించాలి. అందరికీ చెప్పే విషయమైతే నటీనటులు కచ్చితంగా వెల్లడిస్తారు. వారే స్వయంగా ప్రకటిస్తారు" అని చెప్పారు.

ఇక అదితి ఇటీవలె 'హీరామండి : ది డైమెండ్ బజార్' అనే వెబ్​ సిరీస్​లో నటించింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్ వేదికగా ఆ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ మంచి టాక్​తో దూసుకెళ్తోంది. ఇక సిద్ధార్థ్​ ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో నటించారు.

ABOUT THE AUTHOR

...view details