తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సుశాంత్ సింగ్​ ఇల్లు కొనుగోలుపై మాట్లాడిన అదా శర్మ - ఏం చెప్పిందంటే? - Adah Sharma - ADAH SHARMA

Adah Sharma : ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమైనా ఈ మధ్యే ది కేరళ స్టోరీతో కాస్త గుర్తింపు తెచ్చుకున్న నటి అదా శర్మ. అయితే ఈమె కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ఓ నటుడి ఇంటిని కొనుగోలు చేసినట్లు కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ఆ వివరాలు.

సుశాంత్ సింగ్​ ఇల్లు కొనుగోలుపై మాట్లాడిన అదా శర్మ - ఏం చెప్పిందంటే?
సుశాంత్ సింగ్​ ఇల్లు కొనుగోలుపై మాట్లాడిన అదా శర్మ - ఏం చెప్పిందంటే?

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 12:05 PM IST

Adah Sharma Sushant Singh House : నటి అదా శర్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌ సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సన్నాఫ్‌ సత్యమూర్తి, గరం, క్షణం, కల్కి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక గతేడాది రిలీజైన కేరళ స్టోరీతో సెన్సేషన్ అయ్యారు. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఈమె బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇంటిని కొనుగోలు చేశారంటూ చాలా రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనిపై అదా శర్మ స్పందించారు. సరైన సమయం వచ్చిన్నప్పుడు ఈ విషయం గురించి తప్పకుండా మాట్లాడతానని అన్నారు.

"ప్రస్తుతానికి తాను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నానని చెప్పారు. దాని తాను అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైతే నేను ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నాను. దానికి అద్దె చెల్లించాల్సిన పని లేదు. ఏ విషయమైనా సరే మాట్లాడటానికి ఒక సరైన సమయం ఉంటుంది. ఆ ఇల్లు చూసేందుకు నేను వెళ్లినప్పుడు మీడియా నాపై బాగా దృష్టి సారించింది. అందుకు నేను సంతోషిస్తున్నాను. పర్సనల్​ విషయానికొస్తే నేనొక ప్రైవేట్‌ పర్సన్‌ను. ఈ భూమ్మీద లేని ఓ వ్యక్తి గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అంటే మరణించిన వ్యక్తిపై కామెంట్లు చేయడం సరైన పద్ధతి కాదని చెబుతున్నాను. ఆయన ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. ఆయన గౌరవాన్ని కాపాడటమే నా ముఖ్య ఉద్దేశం" అని ఆమె అన్నారు. కాగా, అదా శర్మ ప్రస్తుతం నటించిన ది గేమ్ ఆఫ్ గిర్గిత్ ప్రీ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

ఇకపోతే ఎం.ఎస్‌.ధోనీ, వెల్‌కమ్‌ టు న్యూయార్క్‌, రబ్తా, ఛిఛోరే వంటి చిత్రాలతో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు సుశాంత్ సింగ్. యూత్​లో బాగానే క్రేజ్ సంపాదించుకున్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఆయన 2020 జూన్‌ 14న ఆత్మహత్య చేసుకుని అందరికీ షాకిచ్చారు. ముంబయిలోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, వ్యక్తిగత కారణాల వల్ల మానసిక కుంగుబాటుకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తమ దర్యాప్తులో పేర్కొన్నారని కథనాలు వచ్చాయి.

విజయ్​ 'ఫ్యామిలీ స్టార్'​ ఫస్ట్ డే కలెక్షన్స్​ - ఓపెనింగ్స్​ ఎన్ని కోట్లంటే? - Family star Day 1 collections

రూ.20 కోట్లతో రూ.200 కోట్ల కలెక్షన్స్​ - బ్లాక్ బస్టర్​ మంజుమ్మ‌ల్ బాయ్స్‌ తెలుగు రివ్యూ - Manjummel Boys Telugu review

ABOUT THE AUTHOR

...view details