Actress Started Career With Rs 1 : సినీ పరిశ్రమ గురించి అంతగా తెలియని వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే సూపర్ స్టార్ల సరసన నటించే స్థాయికి ఎదిగిపోయారు. తొలి సినిమాకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ తీసుకుని స్టార్ కెరీర్ వైపుకు అడుగులేశారు. అయితే చివరి రోజుల్లో అనారోగ్య సమస్యల కారణంగా ఏ తోడు లేకుండా ఒంటరిగానే కన్నుముశారు. ఆమెవరో కాదు హిందీ చలనచిత్ర నటి సాధన. సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఆమె జీవితంలో ఉన్నో మలుపులు, ఎన్నో సమస్యలు. ఇంతకీ ఆమె కెరీర్ ఎలా సాగిందంటే?
1942 సెప్టెంబర్ 2న కరాచీలో జన్మించిన సాదన పూర్తి పేరు అంజలి శివదాసానీ. తనకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు దేశ విభజనలో భాగంగా ఆమె కుటుంబం ముంబయికి వలస వచ్చింది. ఆర్థిక సమస్యల కారణంగా టైపిస్ట్‌గా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూనే చదువుకునేవారు.
కాలేజీ రోజుల్లో తొలి సినిమా ఆఫర్ - రెమ్యూనరేషన్ రూ.1
ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్న సమయంలో సాధనకు సినిమాల్లో నటించే ఛాన్స్ దొరికింది. తన 13వ ఏట ఆమెకు దిగ్గజ నటుడు రాజ్ కపూర్ నటించిన 'శ్రీ 420'లో ఆఫర్ వచ్చింది. అయితే ఆ చిత్రంలో ఆమె ఓ పాటలో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కనించారు. కానీ, కాలేజీ రోజుల్లో ఆమె ఓ నాటికలో నటించగా, అది చూసిన ప్రొడ్యూసర్లు 'అబానా' అనే సింధి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. అందులో యాక్ట్ చేసినందుకు ఆమె రూ.1 మాత్రమే రెమ్యూనరేషన్ అందుకున్నారు.
అయితే 'అబానా' మూవీ ప్రమోషన్స్ సమయంలో శశధర్ ముఖర్జీ అనే నిర్మాత దృషిని ఆకర్షించారు సాధన. దీంతో ఆయన తన తనయడు జో ముఖర్జీ లీడ్ రోల్లో తెరకెక్కిన 'లవ్ ఇన్ షిమ్లా'లో ఫీమేల్ లీడ్‌గా అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించగా, సాధన కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ప్రత్యేకించి ఆ చిత్రంలో ఆమె హెయిర్ స్టైల్ యూత్‌ను తెగ ఆకట్టుకుంది. ఆ తర్వాత సాధన 'హమ్ దోనో', 'అస్లీ నక్లీ', 'మేరే మెహబూబ్', 'వో కౌన్ థీ', 'మేరే సాయా', 'వక్త్', 'అనితా' లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
పర్సనల్ లైఫ్‌లో కష్టాలు - చివరి రోజుల్లో అలా
తన కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన 'లవ్ ఇన్ షిమ్లా' డైరెక్టర్ రామ్కృష్ణ నయ్యార్‌తో సాధన వివాహబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు 30 ఏళ్ల సంసారజీవితం గడిపాక ఆయన 1995లో అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. అప్పటికే వీరిద్దరికి పిల్లలు లేకపోవడం వల్ల ఆమె ఒంటరిగానే జీవనం సాగించారు.