తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సిటాడెల్​లో నటించడం ఓ సవాలు- అలాంటి పాత్రలు చెయ్యను' - SAMANTHA CITADEL

సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - అలాంటి పాత్రలకు దూరంగా ఉంటారట!

Samantha Citadel
Samantha Citadel (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 10:59 AM IST

Samantha Citadel : స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్​గా 'సిటాడెల్ హనీ బన్నీ' వెబ్​సిరీస్​తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఈ సిరీస్​ ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. అయితే సినిమాల్లో మహిళల పాత్రల గురించి సమంత మాట్లాడారు. మహిళలకు గుర్తింపు వచ్చేలా చేయడం ఓ నటిగా తన బాధ్యత అని తాజాగా పాల్గొన్న ఓ ఈవెంట్​లో పేర్కొన్నారు.

'ఆడియెన్స్​ అన్ని విషయాలను గమనిస్తారు. అందుకే చేసేవాటిని చాలా బాధ్యతతో చేయాల్సి ఉంటుంది. నేను ఒక క్యారెక్టర్​లో నటిస్తున్నప్పుడు, దానికి సంబంధించిన పూర్తి బాధ్యత నాపైనే ఉంటుంది. అందుకే చాలా విషయాల గురించి ఆలోచించాకే పాత్రలు ఎంపిక చేసుకుంటా. మహిళలకు సమాజంలో న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నాను. సినిమాల్లోనూ కూడా రెండు, మూడు సన్నివేశాలకే పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటాను. అలాగే నేను చేసే బ్రాండ్ ఎండార్స్​మెంట్స్ గురించి కూడా ఆలోచిస్తా'

'నా రీసెంట్ వెబ్​సిరీస్​ సిటడెల్ : హనీ బన్నీ'లో నటించడం ఓ సవాలుగా అనిపించింది. అందులో నాది హీరోకు సమానమైన పాత్ర. యాక్షన్‌ సీన్స్​లో కూడా హీరోతో సమానంగా చేశా. ఇలాంటి పాత్రల్లో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ పాత్రల కోసం ఎందరో నటీమణులు ఎదురుచూస్తున్నారు. నాకు ఎన్నో అవకాశాలు వచ్చిన, అందులో కొన్నింటినే ఎంచుకున్నాను' అని సమంత చెప్పారు.

కాగా, ఈ వెబ్​సిరీస్ స్టార్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్‌ సిరీస్‌'సిటడెల్‌'కు ఇది ఇండియన్‌ వెర్షన్‌. ఇందులో సమంతతోపాటు బాలీవుడ్​ స్టార్ హీరో వరుణ్ ధావన్ కీలక పాత్రలో నటించారు. ఈ వెబ్​సిరీస్​లో సమంత నటనకుగాను ప్రశంసలు దక్కుతున్నాయి.

కాగా, సామ్ మరో వెబ్​సిరీస్​కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ డైరెక్టర్​ రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న సిరీస్​లో సమంత నటిస్తున్నట్లు సమాచారం. ఓ రాజవంశ కుటుంబం నేపథ్యంలో ఈ వెబ్​సిరీస్​ రూపొందుతోంది. రాజ్యం కోసం కుటుంబంలోని ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే పోరాటాలు, రాజకీయ అంశాలలో ఈ కథ సాగనుంది. ఇందులో సమంత యువరాణి పాత్ర పోషించనున్నట్లు ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్​లో బిజీబిజీగా సమంత- మరో వెబ్​సిరీస్​లో ఛాన్స్​- ఈసారి యువరాణిగా!

'అది ఎలా చేశానో ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే' - సమంత

ABOUT THE AUTHOR

...view details