తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గగన్​యాన్​ పైలట్​ మా ఆయనే- జనవరిలోనే పెళ్లయింది!'- నటి షాకింగ్ ప్రకటన - మలయాళ నటి లీనా భర్త

Actress Lena Husband : ప్రముఖ మలయాళ నటి లీనా తాజాగా ఓ సంచలనమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రతిష్టాత్మక 'గగన్​యాన్'​ టీమ్​కు ఎంపికైన ప్రశాంత్ బాలకృష్ణన్ తన భర్త అంటూ ఇన్​స్టాగ్రామ్​లో వారిద్దరి పోస్ట్​ను షేర్ చేశారు.

Actress Lena Husband
Actress Lena Husband

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:18 PM IST

Updated : Feb 28, 2024, 1:32 PM IST

Actress Lena Husband :మలయాళ నటి లెనా ఇటీవలే తన భర్త గురించి సోషల్ మీడియా వేదికగా రివీల్​ చేశారు. ప్రతిష్టాత్మక గగన్​యాన్ ప్రాజెక్ట్​కు ఎంపికైన వ్యోమగాముల టీమ్​లోని గ్రూప్‌ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణను ఆమె వివాహం చేసుకున్నట్లు తెలిపారు. గన్‌యాన్‌ టీమ్​ను ప్రధాని మోదీ ప్రకటించిన కాసేపటికే తర్వాత లీనా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

"ఫిబ్రవరి 27న మన ప్రధాని మోదీ తొలి 'ఆస్ట్రోనాట్ వింగ్స్‌'ను ఎయిర్‌ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌, గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌కు ఎంపిక చేశారు. ఇది మన దేశానికి, కేరళకి, వ్యక్తిగతంగా నాకు ఎంతో గర్వించదగ్గ విషయం. వృత్తిపరంగా కొన్ని కారణాల వల్ల నేన ఓ విషయాన్ని ఇప్పటివరకు మీ నుంచి రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. దాన్ని చెప్పేందుకు ఇంతకంటే గొప్ప సమయం నాకు దొరకలేదు. ఈ ఏడాది జనవరి 17న నేను ప్రశాంత్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. సంప్రదాయ పద్ధతిలోనే అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరిగింది" అంటూ లీనా వెల్లడించారు.

ఇక ఈ పోస్ట్​ ద్వారా తమ పెళ్లి ఫొటోలతో పాటు, ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌తో కలిసి దిగిన చిత్రాలతో అలాగే వాళ్లిద్దరి ఫొటోలు ఉన్నఓ వీడియోను ఆమె సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. అయితే, ఈ విషయంపై ప్రకటనపై అటు ప్రశాంత్‌ బాలకృష్ణన్​ నుంచి కానీ ఆయన ఫ్యామిలీ మెంబర్స్​ నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి రెస్పాన్స్​ లేదు.

Actress Lena Career : అయితే లీనాకి ఇది రెండో వివాహం. గతంలో ఆమె అభిలాష్ కుమార్ అనే వ్యక్తిని 2004లో వివాహం చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2013లో ఆ ఇద్దరూ విడిపోయారు. ఇక లీనా తన 25 ఏళ్ళ సినిమా కెరీర్‌లో దాదాపు 175కి పైగా సినిమాల్లో నటించారు. ఓ నటిగానే కాకుండా ఆమె రచయితగా కూడా ఫేమసయ్యారు. తన రచనలతో అభిమానులను అలరించారు.

షాకింగ్ ​: సీక్రెట్​గా పెళ్లి - ఏడాదికే విడాకులు తీసుకున్న జబర్దస్త్​ నటి

మంచు కొండల్లో ప్రపోజల్​ - ప్రియుడికి ఎస్​ చెప్పిన 'ఎవడు' బ్యూటీ

Last Updated : Feb 28, 2024, 1:32 PM IST

ABOUT THE AUTHOR

...view details