Actor Vishal About Hema Committee : మాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి తాజాగా నటుడు విశాల్ మాట్లాడారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలను ఇబ్బందిపెట్టిన వారికి సరైన శిక్ష పడాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కోలీవుడ్‌లోనూ ఇటువంటి కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు విశాల్ అన్నారు. ఇప్పటికే ఈ విషయం గురించి తమ సంఘం సభ్యులతో చర్చించి ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. దీని కోసం ఓ 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని కూడా ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు విశాల్ చెప్పారు.
"హేమ కమిటీ రిపోర్ట్‌లో పేర్కున్న విషయాలను చదివి నేను ఎంతగానో షాకయ్యాకు. మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం చాలా బాధాకరం. తమ సినిమాల్లో అవకాశం ఇస్తామని చెప్పి, మహిళలతో అలా తప్పుగా ప్రవర్తించేవాళ్లకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వాటికి ధైర్యంగా స్పందించాలి. సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తాం, మాకు కొన్ని ఫేవర్స్ చేయాలంటూ అడిగే వారి చెంప చెళ్లుమనిపించాలి. కొన్ని నకిలీ నిర్మాణ సంస్థల వల్ల కోలీవుడ్‌లోనూ పలువురు మహిళలు ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. అందుకే మా చిత్ర పరిశ్రమలోనూ మేము ఈతరహా కమిటీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఈమేరకు ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం" అని విశాల్ తెలిపారు.
Hema Committee Report Malayalam Actor Mukesh Rape Case :మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక వల్ల ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి 17 కేసుల వరకు నమోదయ్యాయని తెలిసింది. అయితే తాజాగా మరో కేసు నమోదైంది.