తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బామ్మర్ది ఎంగేజ్​మెంట్​లో తారక్ సందడి - ఫొటోలు చూశారా? - ACTOR NARNE NITHIIN ENGAGEMENT

యంగ్​ హీరో నార్నే నితిన్ ఎంగేజ్​మెంట్​లో - ఫొటోలు చూశారా?

Actor Narne Nithin Engagement
Actor Narne Nithin Engagement (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 3, 2024, 5:41 PM IST

Actor Narne Nithiin Engagement : 'మ్యాడ్' మూవీ ఫేమ్ యంగ్ హీరో నార్నే నితిన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఈయన నిశ్చితార్థం సన్నిహితులు, ప్రముఖుల సమక్షంలో గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకలో నితిన్ బావ జూనియర్ ఎన్​టీఆర్​ తన ఫ్యామిలీతో వచ్చి సందడి చేసింది. లక్ష్మీ ప్రణతి, అభయ్‌, భార్గవ్‌తో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. వీరితో పాటు కల్యాణ్ రామ్‌ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో సందడి చేసింది. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, నిర్మాత చినబాబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్​మెంట్ ఫొటోలు, వీడియోలు​ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు వీరి వివాహాం కూడా త్వరలోనే ఘనంగా జరగనున్నట్లు తెలుస్తోంది. పెళ్లి డేట్​ను కూడా త్వరలోనే నిర్ణయిస్తారని సమాచారం.

ప్రముఖ ఇండస్ట్రీయలిస్ట్ నార్నే శ్రీనివాసరావు తనయుడు నార్నే నితిన్‌చంద్ర. జూనియర్ ఎన్​టీఆర్ బావ మరిదిగా (లక్ష్మీ ప్రణతి సోదరుడు) ఈ యంగ్ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2023లో వచ్చిన 'మ్యాడ్‌'తో ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆయన నటించిన 'ఆయ్‌' కూడా మంచి టాక్​తో థియేటర్లలో రన్ అయ్యింది.

'మ్యాడ్ స్క్వేర్'​లో నితిన్
ఇక నార్నే నితిన్‌ నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'మ్యాడ్‌'. ఇందులో నితిన్​తో పాటు సంతోష్ శోభన్​, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోతో పాటు ఇందులోని నటీనటులందరూ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్​గా 'మ్యాడ్​ స్క్వేర్​' తెరకెక్కనుంది. తాజాగా ఆ అనౌన్స్​మెంట్​ను మేకర్స్ అఫీషియల్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 'మ్యాడ్‌ స్క్వేర్‌' గురించి అనౌన్స్​ చేసింది. ఉగాది రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డ ఈ వేడుకలో పాల్గొన్నారు.

'మ్యాడ్​' టీమ్ రీయూనియన్​ - సీక్వెల్​తో వచ్చేస్తున్నారుగా! - Mad Square Movie

ABOUT THE AUTHOR

...view details