Salman Khan Threat Case :కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కూడా బాలీవుడ్ భాయ్‌కు బెదిరింపులు వచ్చాయి. తాను గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తినంటూ బెదిరించి రూ.5 కోట్లు డిమాండ్ చేశాడు. అయితే దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, తాజాగా ఈ కేసులో 24 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. నిందుతుడిని కర్ణాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన సోహైల్ పాషాగా గుర్తించారు అధికారులు. 24 ఏళ్ల ఆ నిందితుడు ఓ సాంగ్ రైటర్ అని, తన పాట ఫేమస్ అయ్యేందుకే ఇలా చేసినట్లు తమతో చెప్పాడని పోలీసులు తెలిపారు.
సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసు - 24 ఏళ్ల సాంగ్ రైటర్ అరెస్ట్ - SALMAN KHAN THREATS
సల్మాన్ ఖాన్ బెదిరింపుల కేసులో నిందుతుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
Salman Khan Threat Case (source ETV Bharat)
Published : Nov 12, 2024, 10:25 PM IST