1000 Dancer For Song Shoot :సాధారణంగా సినిమాల్లో హీరో ఎంట్రీ సాంగ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంటారు. ఆయన్ను పొగుడుతూ పాటలు రాయడం కానీ లేకుంటే ఏదైనా స్పెషల్ ప్లేస్‌లో షూట్ చేయడం కానీ చేస్తుంటారు. అయితే బాలీవుడ్‌కు చెందిన కార్తీక్ ఆర్యన్ కోసం మేకర్స్ ఓ స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారని సమాచారం. ఆయన ఎంట్రీ సాంగ్ కోసం ఏకంగా 1000 మంది డ్యాన్సర్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం కార్తీక్ ఆర్యన్ లీడ్ రోల్లో వస్తున్న 'భూల్ భులయ్యా 3' సినిమాలో హీరో ఎంట్రీ సాంగ్ కోసం ప్రముఖ బీటౌన్ డ్యాన్స్ కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య ఈ ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం కార్తీక్ ఆర్యన్ కూడా రెండు వారాలుగా ప్రిపేర్ అవుతున్నారట. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
"భూల్ భులయ్యా 3 మూవీ ఆడియెన్స్‌కు ఓ విజువల్ వండర్‌లా ఉంటుంది. ఇందులోని కొన్ని సీన్స్ అయితే అసలు ఊహకు కూడా అందనట్లు అనిపిస్తాయి. నేను ఇంత భారీ ప్రాజెక్టులో ఇప్పటివరకు నటించలేదు. ఈ అద్భుతమైన జర్నీ కోసం మీ దీవెనలు నాపై ఎప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను" అంటూ మూవీ గురించి అన్నారు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ కార్తీక్ చెప్పింది ఆ పాట గురించే అంటూ నెట్టింట చర్చలు మొదలెట్టారు. సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా రెండు పార్టులుగా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకున్న సంగతి తెలిసిందే.