Telangana E CET Results 2024 Released: తెలంగాణ 2024- 25 ఏడాదికి సంబంధించి టీఎస్ ఈ సెట్ ఫలితాలు విద్యాశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు 23,306 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు అర్హత సాధించారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి తెలిపారు. విజేతలైన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు బీటెక్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు 10,534 సీట్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.
TS E CET Result Link : గత సంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ఖాళీగా మిగిలిన సీట్లు ప్రస్తుతం విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ఆచార్య లింబాద్రి తెలిపారు. వాటితో కలిపితే మొత్తం 25,288 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కన్వీనర్ కోటాలో 10,734 సీట్లు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. మేడ్చల్ మల్గాజిగిరికి చెందిన విద్యార్థికి మొదటి ర్యాంక్ వచ్చిందని తెలిపారు.
TS E CET Qualify Students 2024: ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో టీఎస్ ఈ సెట్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా మే 6న 99 కేంద్రాల్లో నిర్వహించారు. విద్యార్థులు ఫలితాల కోసం https://ecet.tsche.ac.in/ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థుల ర్యాంక్ కార్డులను పొందుపరిచామని అన్నారు. జూన్ రెండో వారం నుంచి అడ్మిషన్ షెడ్యూల్ ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ సెంకడియర్‌లో ప్రవేశించేందుకు ఈ పరీక్ష ద్వారా అవకాశం ఉంటుంది.