The Decision Book Summary :క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో జాబ్‌లో చేరిన కొత్తల్లో ట్రైనింగ్‌లో భాగంగా 'డెసిషన్ మేకింగ్ మోడల్స్' కొన్నిటిని నేర్పిస్తారు. అన్నిటికన్నా ముందు అత్యవసరంగా చేయాల్సిన ముఖ్యమైన వర్క్‌ను పూర్తి చేసి, ఆ వరుసలో చివరగా అత్యవసరం కాని సాధారణ పనులను ఇతరుల చేత సావకాశంగా చేయించుకోమని చెప్తారు. అలాంటి డెసిషన్ మేకింగ్ మోడల్స్ మన నిర్ణయాలను ప్రభావితం చేసి, పనితనాన్ని మెరుగుపరిచే దిశగా తీసుకువెళతాయి. ఈ విషయంలో రోమన్ షాపెలర్, మైకేల్ క్రొగెరస్ రాసిన పుస్తకం ది డెసిషన్ బుక్. దీనిలో మొత్తం 50 నిర్ణయాలను నిర్దేశించే మోడల్స్‌ని సంక్షిప్తంగా, ఆకర్షణీయంగా రచయితలు అందించారు.
ఇందులో చెప్పిన అంశాలను పెద్ద శ్రమ పడకుండా ఆచరణాత్మకంగా ఎలా చేయాలో చెప్పే విధానం ది డెసిషన్ బుక్’ ప్రత్యేకత. ఈ బుక్‌లో ఇచ్చిన మోడల్స్ వ్యక్తిగత అభివృద్ధికీ, వ్యూహాత్మక ఆలోచనలకూ ఉపయోగపడుతుంది. ప్రాజెక్ట్ నిర్వహణకు ఏ అంశాలను పరిగణిస్తే నిర్ణయాలు మెరుగైన ఫలితాలకు దారితీస్తాయో రచయితలు వివరించారు.
ది డెసిషన్ బుక్‌లోని 4 ప్రధాన విభాగాలు : -
- మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరచుకోవాలి
- ఎలా మెరుగ్గా అర్థం చేసుకోవాలి
- ఇతరులను ఎలా మెరుగ్గా అర్థం చేసుకోవాలి
- ఇతరులను ఎలా మెరుగుపరచాలి అనేవి
కెరియర్ ప్లానింగ్, వ్యక్తిగత అభివృద్ధి : -
ఐసెన్ హోవర్ మ్యాట్రిక్స్ :సమయ నిర్వహణ కోసం పనులను వాటి అవసరం, ప్రాముఖ్యాలను అనుసరించి పూర్తి చేసుకోవాలి. ఇది ఉద్యోగ వేట, వ్యక్తిగత జీవితం, నైపుణ్య అభివృద్ధి - ఈ మూడిటి మధ్య సమతుల్యానికి విలువైన మోడల్.
పర్సనల్ పర్ఫార్మెన్స్ మోడల్ : రోజు మొత్తంలో కొన్ని సమయాల్లో చురుకుగా, కొన్ని సమయాల్లో అలసటతో నీరసంగా ఉంటాం. ఆసక్తి, శక్తిలో ఉండే ఈ ఎగుడుదిగుడులను గుర్తించడంలో ఈ మోడల్ సహాయం చేస్తోంది. నూతన విషయాలను నేర్చుకునే టైంనీ, చేయాల్సిన పనులను ఏ వరుసలో చేస్తే ప్రభావవంతంగా ఉంటుందో సూచిస్తోంది.
పోర్ట్ ఫోలియో కెరియర్ మోడల్ :వైవిధ్యమైన కెరియర్ పోర్ట్ ఫోలియోను సృష్టించడానికి వివిధ నైపుణ్యాలూ, అనుభవాలను మ్యాపింగ్ చేయడంలో సహాయం చేస్తోంది.
అత్యంత ప్రభావశీలమైన (తక్కువ నిడివి ఉండి, ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే) పాఠాలపై దృష్టి సారించడానికి ‘పరేటో సిద్ధాంతాన్ని’ (80/20 నియమం) వినిపయోగించాలి.
కెరియర్ ప్లానింగ్ : -
- మేజర్, మైనర్ సబ్జెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు లేదా ఉద్యోగ ఆఫర్‌ల ఎంపికకు ‘డెసిషన్ ట్రీ’ ఉపయోగకరం
- సాధించదగిన విద్య, కెరియర్ లక్ష్యాలను రూపొందించుకోవడానికి ‘గోల్ సెట్టింగ్ మోడల్’ ప్రయోజనకరం
నాయకత్వ లక్షణాల అభివృద్ధి : -