SSC Launches New Website : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌ను మార్చింది. ప్రస్తుతం ఉన్న https://ssc.nic.in/ యూఆర్ఎల్ను https://ssc.gov.in/ గా మార్చినట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త వెబ్‌సైట్‌ను ఫిబ్రవరి 17నే ప్రారంభించినట్లు పేర్కొంది. కనుక అభ్యర్థులు అందరూ ఈ విషయాన్ని గమనించాలని వెల్లడించింది.
ఓటీఆర్ తప్పనిసరి
వెబ్‌సైట్ పేరును మార్చిన నేపథ్యంలో అభ్యర్థులు అందరకూ కచ్చితంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇకపై ఉద్యోగ ప్రకటనలు, పరీక్ష ఫలితాలు అన్నీ నూతన వెబ్‌సైట్‌లోనే ప్రచురితం అవుతాయని వెల్లడించింది. అందువల్ల రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వెబ్‌సైట్‌లోనే చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
Employment News February 2024
1. Central Bank of India Jobs 2024 :సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా3000 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 100 పోస్టులు (గుంటూరు - 40, విజయవాడ - 30, విశాఖపట్నం - 30); తెలంగాణాలో 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్ - 38) ఉన్నాయి. డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2024 ఫిబ్రవరి 21
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ : 2024 మార్చి 6
- ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 2024 మార్చి 10
2. IFS Jobs 2024 :యూపీఎస్సీ 150 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 2024 మార్చి 5. ప్రిలిమినరీ పరీక్ష 2024 మే 26న నిర్వహిస్తారు.
3. AAI Recruitment 2024 :ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ డిగ్రీలు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు.