SSC Jobs 2024 :స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 'సెలక్షన్ పోస్ట్ ఫేజ్-12' రిక్రూట్మెంట్కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని, పలు విభాగాల్లో నియమిస్తారు.
ఉద్యోగాల వివరాలు
- జనరల్ పోస్టులు - 186 పోస్టులు
- ఓబీసీ - 456 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 186 పోస్టులు
- ఎస్టీ - 124 పోస్టులు
- ఎస్సీ - 255 పోస్టులు
- మొత్తం పోస్టులు - 2049
విద్యార్హతలు
SSC Selection Posts Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమాలో క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
SSC Selection Posts Age Limit :అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SSC Selection Posts Application Fee :జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పనిలేదు.
ఎంపిక ప్రక్రియ
SSC Selection Posts Selection Process :అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ - టైపింగ్/ డేటా ఎంట్రీ/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
SSC Selection Posts Application Process :
- అభ్యర్థులు ముందుగా ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ https://ssc.gov.in/ ఓపెన్ చేయాలి.
- వెబ్సైట్లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
- అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది.
- ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి.
- అప్లికేషన్ ఫామ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుము కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- వివరాలు అన్నీ మరోసారి చెక్చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
SSC Selection Posts Apply Last Date :
- దరఖాస్తుల స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 26
- దరఖాస్తుకు ఆఖరు తేదీ :2024 మార్చి 18
- పరీక్ష తేదీ :2024 మే 6, 8 తేదీలు
ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 314 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!
ఇండియన్ నేవీలో 254 ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!