SSC JE Jobs 2024 :స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 968 జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖల్లో/ సంస్థల్లో గ్రూప్-బీ (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజినీర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- జేఈ (సివిల్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 438
- జేఈ (ఎలక్ట్రికల్ & మెకానికల్), బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (పురుషులకు మాత్రమే): 37
- జేఈ (సివిల్), బ్రహ్మపుత్ర బోర్డు, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (మెకానికల్), సెంట్రల్ వాటర్ కమిషన్ : 12
- జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ కమిషన్ : 120
- జేఈ (ఎలక్ట్రికల్), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ : 121
- జేఈ (సివిల్), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ : 217
- జేఈ (ఎలక్ట్రికల్), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ : 02
- జేఈ (సివిల్), సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ స్టేషన్ : 03
- జేఈ (మెకానికల్), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ : 03
- జేఈ (ఎలక్ట్రికల్), డీజీక్యూఏ- నావల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ : 03
- జేఈ (ఎలక్ట్రికల్), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (సివిల్), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, జల శక్తి మంత్రిత్వ శాఖ : 02
- జేఈ (సివిల్), మిలిటరీ ఇంజినీర్ సర్వీస్ : తర్వాత తెలియజేస్తారు.
- జేఈ (ఎలక్ట్రికల్ & మెకానికల్), మిలిటరీ ఇంజనీర్ సర్వీస్: తర్వాత తెలియజేస్తారు.
- జేఈ (సివిల్), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ : 06
- మొత్తం పోస్టుల : 968
విద్యార్హతలు
SSC JE Qualifications :అభ్యర్థులు సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. లేదా డిగ్రీ (సివిల్/ మెకానికల్/ ఎలక్ట్రికల్) చదివి ఉండాలి. లేదా తత్సమానమైన విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి
SSC JE Age Limit :సీపీడబ్ల్యూడీ విభాగం పోస్టులకు గరిష్ఠంగా 32 ఏళ్లు; ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరితుల్లో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
SSC JE Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, ఎస్సీ, ఎస్టీలకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
జీత భత్యాలు
SSC JE Salary :సెవెన్త్ పే స్కేల్ ప్రకారం, జూనియర్ ఇంజినీర్లకు నెలకు రూ.35,400- రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.