తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

SSC భారీ నోటిఫికేషన్​ - ఇంటర్​ అర్హతతో 3712 పోస్టులు భర్తీ! - SSC Jobs 2024

SSC CHSL Notification 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అందరికీ గుడ్​ న్యూస్​. స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ (SSC) 3712 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SSC CHSL Notification 2024
SSC jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 11:09 AM IST

SSC CHSL Notification 2024 : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్​ఎస్​సీ) ఆధ్వర్యంలో 'కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2024' కోసం ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజనల్ క్లర్క్​, జూనియర్ సెక్రటేరియట్​ అసిస్టెంట్​, డేటా ఎంట్రీ ఆపరేటర్​​ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లలో పనిచేయాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ)
  • జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో)
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఏ)
  • మొత్తం పోస్టులు : 3,712

విద్యార్హతలు
SSC Job Qualifications :

  • అభ్యర్థులు (10+2) ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2024 ఆగస్టు 1 నాటికి ఇంటర్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీల్లోని - డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియెట్​​ (10+2)లో సైన్స్‌ గ్రూప్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదవి ఉండాలి.

వయోపరిమితి
SSC Job Age Limit :

  • అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల పాటు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SSC Job Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతభత్యాలు
SSC Job Salary :

  • ఎల్‌డీసీ, జేఎస్‌ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 - రూ.63,200 వరకు జీతం ఇస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నెలకు రూ.25,500- రూ.81,100 వరకు జీతం అందిస్తారు.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఏ)లకు నెలకు రూ.29,200- రూ.92,300 వరకు సాలరీ ఇస్తారు.

ఎంపిక విధానం
SSC Job Selection Process : అభ్యర్థులకు ముందుగా టైర్‌-1, టైర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. తరువాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు చేసి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, రాజమహేంద్రవరం, కాకినాడ, నెల్లూరు, విజయనగరం, చీరాల.
  • తెలంగాణాలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, కర్నూలు

దరఖాస్తు విధానం
SSC CHSL Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ https://ssc.gov.in/ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్పుడు మీకు ఒక యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్​ అవుతాయి.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్య తేదీలు
SSC CHSL Recruitment Apply Last Date :

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఏప్రిల్​ 8
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మే 7
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ :2024 మే 8
  • దరఖాస్తు సవరణ తేదీలు : 2024 మే 10 నుంచి 11 వరకు
  • టైర్‌-1 (కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్​) తేదీలు :జూన్‌-జులై
  • టైర్‌-2 (కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్​) తేదీలు : వివరాలు తర్వాత ప్రకటిస్తారు.

పది, ఐటీఐ అర్హతతో - మర్చెంట్ నేవీలో 4000 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Merchant Navy Recruitment 2024

సౌత్​ ఈస్ట్ సెంట్రల్​ రైల్వేలో 1113 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

ABOUT THE AUTHOR

...view details