RRB Job Calendar 2024 : రైల్వే శాఖ నిరుద్యోగులకు, ఆర్ఆర్బీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరిధిలోని వివిధ జోన్లలోని ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించిన 2024 జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది.
రైల్వే శాఖ ఇప్పటికే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం సమాయత్తం అవుతోంది. తాజాగా 2024లో చేపట్టనున్న ఉద్యోగ నియామక పరీక్షల వార్షిక క్యాలెండర్ను విడుదల చేసింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్బీ జాబ్ క్యాలెండర్-2024 వివరాలు
జాబ్ నోటిఫికేషన్ | షెడ్యూల్ |
అసిస్టెంట్ లోకో పైలట్ | జనవరి - మార్చి |
టెక్నీషియన్ | ఏప్రిల్ - జూన్ |
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ - గ్రాడ్యుయేట్ (లెవెల్ 4, 5, 6) | జులై - సెప్టెంబర్ |
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ - గ్రాడ్యుయేట్ (లెవెల్ 2, 3) | జులై - సెప్టెంబర్ |
జూనియర్ ఇంజినీర్ | జులై - సెప్టెంబర్ |
పారామెడికల్ కేటగిరీ | జులై - సెప్టెంబర్ |
మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ (లెవెల్ 1) | అక్టోబర్ - డిసెంబర్ |
ప్రిపరేషన్
పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రైల్వే పోస్టులకు అర్హులు. వీరికి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా రైల్వే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో ఉంటాయి. అయితే రైల్వే శాఖ 2024 జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కనుక, ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో చదివితే, మీరు కోరుకున్న ఉద్యోగం సాధించడం గ్యారెంటీ. ఆల్ ది బెస్ట్.