Reliance Foundation Scholarship :ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి సంబంధించిన "రిలయన్స్ ఫౌండేషన్".. ఉన్నత విద్య చదివేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మొత్తం 5,100 మందికి ఈ ఉపకార వేతనం అందజేయనున్నట్టు తెలిపింది. ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదవబోతున్న 5 వేల మంది విద్యార్థులకు రూ.2లక్షల వరకు.. డిగ్రీ పూర్తి చేసి పీజీ చదవబోతున్న 100 మంది విద్యార్థులకు రూ.6లక్షల వరకు స్కాలర్షిప్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులకు ఆప్టిట్యూడ్ పరీక్ష పెట్టి, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా స్కాలర్ షిప్ అందించనున్నారు. వచ్చే పదేళ్లలో 50వేల స్కాలర్షిప్లు అందిచాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ తెలిపారు. స్కాలర్షిప్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డిగ్రీ స్కాలర్షిప్ కోసం అర్హులు ఎవరంటే?
- భారత దేశ పౌరులై ఉండాలి.
- ఇంటర్లో కనీసం 60శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- 2024-25 విద్యా సంవత్సరంలో మూడేళ్ల డిగ్రీ కోర్సులో చేరి ఉండాలి.
- విద్యార్థి కుటుంబ ఆదాయం రూ.15లక్షల లోపు ఉండాలి(రూ.2.5 లక్షల లోపు ఉన్నవారికి ప్రాధాన్యం)
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాలి.
వీరు అనర్హులు..
- ఇంటర్ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులు
- ఆన్లైన్, హైబ్రిడ్, రిమోట్, దూరవిద్య లేదా మరే ఇతర నాన్ రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న వారు
- పదో తరగతి తర్వాత డిప్లొమా చేసినవారు
- రెండేళ్ల డిగ్రీ కోర్సు చదువుతున్న విద్యార్థులు
- ఆప్టిట్యూడ్ పరీక్ష ఫెయిల్ అయినవారు లేదా చీటింగ్ చేసినవారు.
ఎంపిక విధానం..
- ఆన్లైన్ పద్ధతిలో విద్యార్థులందరికీ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
- 60 నిమిషాలపాటు సాగే ఈ పరీక్షలో 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
- ఇందులో వర్బల్, అనలైటికల్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
- ఆ తర్వాత ఇందులో వచ్చిన మార్కులు, అకడమిక్ రికార్డు, ప్రతిభ, వ్యక్తిగత వివరాల ఆధారంగా స్కాలర్‌షిప్‌నకు ఎంపిక చేస్తారు.
పీజీ స్కాలర్‌షిప్‌నకు ఎవరు అర్హులు?
- భారత దేశ పౌరులై ఉండాలి.
- గేట్ ప్రవేశ పరీక్షలో 550-1000 మధ్య స్కోర్ సంపాదించి ఉండాలి.
- గేట్ పరీక్ష రాయని వారు డిగ్రీలో 7.5కన్నా ఎక్కువ సీజీపీఏ సాధించి ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మాథ్యమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, మెకానికల్, లైఫ్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థులు అర్హులు
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో మంచి మార్కులు సాధించాలి