NTPC Jobs 2024 : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) 110 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ఎలక్ట్రికల్ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 20 పోస్టులు
- మెకానికల్ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 50 పోస్టులు
- సీ&ఐ ఎరెక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 10 పోస్టులు
- సివిల్ కన్స్ట్రక్షన్ (డిప్యూటీ మేనేజర్) - 30 పోస్టులు
- మొత్తం పోస్టులు - 110
విద్యార్హతలు
NTPC Deputy Manager Qualification : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
NTPC Deputy Manager Age Limit :అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 40 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NTPC Deputy Manager Fee :జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, XSM కేటగిరీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.