NPCIL Recruitment 2024 Details:ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్పీసీఐఎల్) 279 Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. మరి, ఈ జాబ్స్‌కి(Jobs) అప్లై చేసుకోవాలంటే కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానం, ఎంపిక విధానం వంటి తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు :Category-II Stipendiary Trainee (ST/TN)-Operator విభాగం కింద 153 ఉద్యోగాలకు, Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer విభాగం కింద 126 పోస్టులకు NPCIL నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
విద్యార్హతలు(Eligibility Criteria):Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer పోస్ట్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి 10th, ITI, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి(Age Limit):Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer జాబ్స్‌కి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు(Application Fee):జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీలకు చెందిన వారందరూ అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. అదే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ(Selection Process):NPCIL నోటిఫికేషన్ 2024 ప్రకారం.. ఎంపిక విధానం రెండు స్టేజెస్‌లో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా.. రెండోది Advance టెస్ట్ ఉంటుంది. అలాగే.. Maintainer ఉద్యోగం కోసం అప్లై చేసినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే.. Operator జాబ్ కోసం అప్లై చేసినవారికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు.