JEE Advanced 2024 Registration :దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష (JEE Advanced Exam)కు నేటి(ఏప్రిల్ 27) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్(JEE Mains)ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అడ్వాన్స్‌డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 7 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే, జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, అప్లికేషన్ ఫీజు, ఎలా అప్లై చేసుకోవాలి, పరీక్ష ఎప్పుడు, ఫలితాల విడుదల తేదీ వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హతలు :
- జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2024కు అప్లై చేసుకోవడానికి జేఈఈ (మెయిన్) 2024 బీఈ/బీటెక్ పేపర్లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో సహా) అభ్యర్థుల్లో ఒకరుగా ఉండాలి.
- అదేవిధంగా అడ్వాన్స్‌డ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. అయితే.. SC, ST, దివ్యాంగులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే.. వీరు 1994 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :మహిళా అభ్యర్థులు, SC, ST, దివ్యాంగులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 1600 చెల్లించాలి. అదే ఇతర అభ్యర్థులు అందరూ రూ. 3200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం(How to apply for JEE Advanced 2024) :
- ముందుగా అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్‌డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024' అనే రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి 'Submit' బటన్‌పై నొక్కాలి.
- అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయి.. అప్లికేషన్ ఫామ్‌లో వివరాలన్ని సరిగ్గా ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి 'Submit పై క్లిక్ చేయాలి.
- ఆపై తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోవాలి.
- అయితే.. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తమకు నచ్చిన ఎనిమిది పరీక్ష నగరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.