తెలంగాణ

telangana

డిగ్రీ అర్హతతో ITBPలో హెడ్ కానిస్టేబుల్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - ITBP Head Constable Jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 9:56 AM IST

ITBP Head Constable Jobs 2024 : డిగ్రీలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఇండో-టిబెటన్ బోర్డర్​ పోలీస్​ ఫోర్స్ (ఐటీబీపీ) 112 హెడ్​ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Head Constable Jobs 2024
ITBP Head Constable Recruitment 2024 (ANI)

ITBP Head Constable Jobs 2024 :ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్​ ఫోర్స్​ (ఐటీబీపీ) 112 హెడ్ కానిస్టేబుల్​ (ఎడ్యుకేషన్​ అండ్​ స్ట్రెస్​ కౌన్సిలర్​) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి పురుషులతోపాటు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ గ్రూప్​-సీ (నాన్​-గెజిటెడ్​, నాన్ మినిస్టీరియల్​) పోస్టులకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

హెడ్ కానిస్టేబుల్​ పోస్టుల వివరాలు

  • పురుషులు - 96
  • మహిళలు - 16
  • మొత్తం పోస్టులు - 112

విద్యార్హతలు
ITBP Head Constable Qualification :సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా డిగ్రీ, బ్యాచిలర్​ ఆఫ్ ఎడ్యుకేషన్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
ITBP Head Constable Age Limit :2024 ఆగస్టు 5 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి నుంచి మినహాయింపులు లభిస్తాయి.

దరఖాస్తు రుసుము
ITBP Head Constable Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, మాజీ సైనికోద్యోగులు, ఎస్టీ, ఎస్సీలకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ
ITBP Head Constable Selection Process :ఫిజికల్​ ఎఫీషియెన్సీ టెస్ట్​, ఫిజికల్​ స్టాండర్డ్ టెస్ట్​, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్​లు చేసి, అర్హులైన వారిని హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
ITBP Head Constable Salary :ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​కు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం
ITBP Head Constable Application Process :

  • ముందుగా ఐటీబీపీ అధికారిక వెబ్​సైట్​ https://recruitment.itbpolice.nic.in/rect/index.php ఓపెన్ చేయాలి.
  • పోర్టల్​లో మీ వివరాలు నమోదు చేసి, రిజిస్టర్​ చేసుకోవాలి. వెంటనే మీకొక యూజర్​ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లో లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్ సహా, అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
ITBP Recruitment 2024 Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం :2024 జులై 7
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఆగస్టు 5

ఆర్ట్స్ విద్యార్థుల కోసం IITs అందిస్తున్న బెస్ట్ కోర్సులు ఇవే! - Arts Students Career Options

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? 'ఒత్తిడి'ని చిత్తు చేసి, విజయాన్ని చేకూర్చే గొప్ప మంత్రం ఇదే! - Stress Management Tips

ABOUT THE AUTHOR

...view details