Indian Coast Guard Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కోస్ట్‌గార్డ్‌లోని వివిధ విభాగాలకు సంబంధించిన అసిస్టెంట్ కమాండెంట్-2025 ప్రవేశాలకు అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య, అర్హత, వయోపరిమితి, పరీక్ష ఫీజు, చివరి తేదీ, తదితర వివరాలు మీ కోసం.
ఏయే విభాగాలు?
1. జనరల్ డ్యూటీ
2. టెక్నికల్ (మెకానికల్)
3. టెక్నికల్ (ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్)
- వయో పరిమితి : కోస్ట్‌గార్డ్ జనరల్ డ్యూటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 2024 జూలై నాటికి 21-25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1999 జూలై 1 నుంచి 2003 జూన్ 30లోపు జన్మించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టెక్నికల్ మెకానికల్ పోస్టులకు :కోస్ట్‌గార్డ్ టెక్నికల్ మెకానికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 2024 జూలై 1 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. అంటే 1999 జూలై 01 నుంచి 2003 జూన్ 30 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు కోస్ట్‌గార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ చూడండి.
- టెక్నికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ : 2024 జూలై 01 నాటికి 21-25 ఏళ్లు ఉండాలి. 1999 జూలై నుంచి 2003 జూన్ 30 లోపు జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొత్తం పోస్టుల సంఖ్య : 70
- అర్హతలు :విభాగాన్ని అనుసరించి ఇంటర్, సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
- ప్రారంభ వేతనం : నెలకు రూ.56,100 వరకు వేతనం ఉంటుంది.
- ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు విధానం :ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎగ్జామ్ ఫీజు : రూ.300( ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది)
- ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించు తేదీ :19-02-2024
- ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ : 06-03-2024
నాన్-ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్-10 కెరీర్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? 2024లో ఫుల్ డిమాండ్ ఉన్న టాప్-6 జాబ్స్ ఇవే!