Hyderabad Institute Of Excellence Scholarship 2025 : ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ (Intermediate) ఎడ్యుకేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే చదువు ఇదేనని నిపుణులు చెబుతుంటారు. అందుకే తల్లిదండ్రులు మంచి కళాశాలల్లో తమ బిడ్డ చదవాలని ఆశపడుతుంటారు. కానీ ఆ కల అందరికీ నెరవేరదు.
ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు ఆ స్థోమత ఉండదు. ఇలాంటి వారికి హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (HYDERABAD INSTITUTE OF EXCELLENCE) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. వచ్చే ఏడాది 2025-26లో ఇంటర్మీడియట్(Intermediate) విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.
బాలురకు మాత్రమే :
హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రవేశం పొందడానికి ముందుగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ అవకాశం కేవలం బాలురకు మాత్రమే. ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో కంప్యూటర్, ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ద్వారా ఎగ్జామ్ రాయవచ్చు. లేదంటే అప్లై చేసుకున్న కొన్ని రోజుల తర్వాత కూడా పరీక్ష రాయొచ్చు. కానీ, జనవరి 31లోపు అప్లికేషన్, పరీక్ష రాయడం పూర్తికావాలి.
అర్హతలు :
- విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువ ఉండాలి.
- విద్యార్థికి తొమ్మిదవ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు రావాలి.
- రాబోయే పదో తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 9.3 GPA సాధించాలి.
- ఈ అర్హతలతోపాటు ఎంట్రెన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి, ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- ఆ దశను విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు.