తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఈ టాప్​-10 సర్టిఫికెట్ కోర్సులు చేస్తే - డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం గ్యారెంటీ! - High Paying Jobs Without Degree - HIGH PAYING JOBS WITHOUT DEGREE

High Paying Jobs Without Degree : మీరు మంచి జీతం వచ్చే ఉద్యోగం చేయాలని ఆశిస్తున్నారా? కానీ డిగ్రీ చేయలేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతం వచ్చే జాబ్స్ ఎన్నో ఉన్నాయి. అవి ఏమిటి? వాటిని పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Top 10 Certifications to Secure High-Paying Job
high paying jobs without degree

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 10:52 AM IST

High Paying Jobs Without Degree : ఈ రోజుల్లో లక్షల రూపాయల ప్యాకేజీలు సాధారణం అయిపోయింది. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఉద్యోగులు తమకు లక్షల్లో జీతాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. సాఫ్ట్​వేర్​ సెక్టార్ సహా అన్ని రంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. డిగ్రీ, పీజీ చేసిన వాళ్లు మాత్రమే ఇలాంటి భారీ వేతనాలు అందుకుంటున్నారు. మరి ఎలాంటి డిగ్రీ లేని వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. అయితే, డిగ్రీ సర్టిఫికెట్ లేకున్నా లక్షల రూపాయల జీతం వచ్చే జాబ్స్ ఎన్నో ఉన్నాయి. అవేంటి? వాటిని పొందాలంటే ఎలాంటి కోర్సులు చేయాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  1. బిజినెస్ ఇంటెలిజెన్స్ (BI) :ఇది బెస్ట్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ కోర్సు. వృత్తి నిపుణులు తమ కెరీర్ అప్​గ్రేడ్ చేసుకునేందుకు ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది.
  2. బిగ్ డేటా & డేటా సైన్స్ :బిగ్ డేటా & డేటా సైన్స్ అనేది నేడు చాలా పాపులర్ అయ్యింది. విలువైన సమాచారాన్ని సేకరించి, దానిని విశ్లేషించి, సంకిష్టమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ డేటా సైన్స్ ఉపయోగపడుతుంది. అందుకే బిగ్ డేటా & డేటా సైన్స్​ చేసినవారికి భారీగా జీతాలు ఇస్తున్నారు.
  3. ప్రాజెక్ట్​ మెనేజ్​మెంట్​ :పరిశ్రమలకు ప్రాజెక్ట్ మేనేజర్లు చాలా అవసరం. అయితే ప్రాజెక్ట్ మేనేజర్​ అర్హత, నైపుణ్యాలను బట్టి జీతాలు ఉంటాయి. బడ్జెట్​ ప్లాన్ చేయడం, వాటిని అమలు చేయడం, పంపిణీ చేయడం సహా, సకాలంలో పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రాజెక్ట్ మేనేజర్లపై ఉంటుంది.
  4. వెబ్​ డెవలప్​మెంట్​ :నేడు వెబ్​డెవలపర్స్​కు మంచి డిమాండ్ ఉంది. సాధారణ వ్యక్తుల నుంచి పెద్దపెద్ద కంపెనీల వరకు, అందరూ ప్రత్యేకమైన వెబ్​సైట్స్, యాప్స్​ను ఏర్పాటుచేసుకుంటున్నారు. అందుకే నేడు వెబ్​ డెవలప్​మెంట్​ కోర్సులు చేసిన వారికి లక్షల్లో జీతాలు లభిస్తున్నాయి.
  5. సాఫ్ట్​వేర్​ డెవలప్​మెంట్ :టెక్నాలజీ రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే సాఫ్ట్​వేర్ రంగంలో ఎన్నో కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. అందుకే సాఫ్ట్​వేర్​ రంగంలో మంచి నైపుణ్యం ఉన్నవారికి లక్షల్లో జీతం లభిస్తోంది.
  6. డెవ్​ఆప్స్​ :డెవ్ఆప్స్​ అంటే డెవలప్​మెంట్ అండ్ ఆపరేషన్స్​ అని అర్థం. ఈ కోర్స్ ప్రధాన ఉద్దేశం, సాఫ్ట్​వేర్​ డెలివరీ సక్రమంగా జరిగేలా చూడడం, టీమ్స్​ మధ్య పరస్పర సహకారం పెంపొందేలా చేయడం. ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. అందుకే ఈ డెవ్​ఆప్స్ కోర్స్​ చేసినవారికి లక్షల్లో జీతాలు ఉంటాయి.
  7. బ్లాక్​ చెయిన్ :బ్లాక్ చెయిన్​ టెక్నాలజీ ద్వారా ఆర్థిక లావాదేవీలు చాలా సురక్షితంగా చేయవచ్చు. ముఖ్యంగా సైబర్ మోసాలకు గురికాకుండా చూసుకోవచ్చు. అందుకే బ్లాక్​ చెయిన్​ టెక్నాలజీలో మంచి నైపుణ్యం ఉన్నవారికి భారీగా జీతాలు లభిస్తున్నాయి.
  8. క్లౌడ్​ కంప్యూటింగ్ :నేడు వ్యాపారాలు అన్నీ ఆన్​లైన్​లోకి మారిపోయాయి. కనుక డేటా మొత్తం క్లౌడ్​లోనే సేవ్ చేసి, యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ క్లౌడ్ కంప్యూటింగ్​ కోర్స్​ చేసినవారికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది.
  9. సైబర్​ సెక్యూరిటీ :డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే సెన్సిటివ్ డేటా భద్రత కోసం సైబర్​ సెక్యూరిటీ అనేది చాలా కీలకంగా మారింది. అందుకే నేడు సైబర్ సెక్యూరిటీ నిపుణులకు భారీగా డిమాండ్ పెరుగుతోంది.
  10. మెషిన్​ లెర్నింగ్​ & ఆర్టిఫీయల్​ ఇంటెలిజెన్స్ :నేటి డిజిటల్ ప్రపంచంలో టెక్ ఇండస్ట్రీ మరింత స్పీడ్ పెంచింది. బడా కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​తో సాఫ్ట్​వేర్స్ తయారుచేస్తున్నాయి. అంతేకాదు ఏఐతో మెషిన్స్​ను కంట్రోల్ చేస్తున్నారు. అందుకే ఈ మెషిన్ లెర్నింగ్​, ఏఐ కోర్స్​లు చేసిన వారికి లక్షల్లో జీతం ఇస్తున్నారు.

మరెందుకు ఆలస్యం, మీకు నచ్చిన కోర్స్​ చేసి, మీరు కోరుకున్న కెరీర్​లో స్థిరపడండి. ఆల్​ ది బెస్ట్!

ABOUT THE AUTHOR

...view details