తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

డిగ్రీ అర్హతతో - కెనరా బ్యాంక్​లో 3000 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా! - Canara Bank Apprentice Jobs - CANARA BANK APPRENTICE JOBS

Canara Bank Apprentice Jobs : బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. కెనరా బ్యాంక్​ 3000 అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.

Canara Bank
Canara Bank (ANI)

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2024, 10:17 AM IST

Canara Bank Apprentice Jobs :నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. కెనరా బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్​లో ఖాళీగా ఉన్న 3000 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు

  • యూఆర్​ - 1302 పోస్టులు
  • ఓబీసీ - 740 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 295 పోస్టులు
  • ఎస్టీ - 184 పోస్టులు
  • ఎస్సీ - 479 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 3000

రాష్ట్రాల వారీగా పోస్టులు వివరాలు

  • ఆంధ్రప్రదేశ్‌ - 200 పోస్టులు
  • తెలంగాణ - 120 పోస్టులు
  • కర్ణాటక - 600 పోస్టులు
  • తమిళనాడు - 350 పోస్టులు

విద్యార్హతలు :ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి :

  • 2024 సెప్టెంబర్​ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • బీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగారూ.500 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ :ఇంటర్​/ డిప్లొమా మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్​, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్​ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ కాలం :ఎంపికైన అభ్యర్థులకుఒక సంవత్సరం పాటు అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది.

స్టైపెండ్ :అప్రెంటీస్​లకునెలకు రూ.15,000 స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా కెనరా బ్యాంక్ అధికారిక వెబ్​సైట్​ https://www.canarabank.com/ ఓపెన్ చేయాలి.
  • కెరీర్స్​ సెక్షన్​లోకి వెళ్లి అప్రెంటీస్​ అప్లికేషన్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • మీ ఫొటో, సిగ్నేచర్​ సహా అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అప్లికేషన్​లోని వివరాలన్నీ మరోసారి చెక్​ చేసుకుని సబ్మిట్​ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2024 సెప్టెంబర్​ 21
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ : 2024 అక్టోబర్​ 4

ABOUT THE AUTHOR

...view details