Book Reading Tips for Children: ఫోన్ చూపించగానే వెలిగిపోయే పిల్లల ముఖాలు.. పుస్తకం చూపిస్తే మాత్రం నీరుగారిపోతాయి! ఇలాంటి పిల్లలకు బుక్స్ అలవాటు చేయడమనేది పెద్ద టాస్క్. అయితే.. తల్లిదండ్రులు చిన్న వయసు నుంచే బుక్ రీడింగ్‌ను ఒక అలవాటుగా మార్చాలని.. ఇందుకు కొన్ని టిప్స్ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మినీ లైబ్రరీ:చిన్నతనం నుంచే పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఇంట్లోని ఓ గదిలో చిన్న లైబ్రరీ రెడీ చేయండి. అందులో పిల్లలు తొందరగా ఎట్రాక్ట్ అయ్యే బుక్స్ ఉండేలా చేయండి. అంతేకాకుండా.. ఇందులో పిల్లల హెల్ప్ తీసుకోండి. వారికి నచ్చినట్టుగా డిజైన్ చేయండి. తద్వారా పిల్లలు అక్కడికి వెళ్లడానికి ఇష్టపడి చిన్నగా చదవడం వైపు మొగ్గు చూపుతారు.
పేరెంట్స్ కూడా చదవాలి:పిల్లలకు బుక్ రీడింగ్ అలవాటు చేసే ముందు పేరెంట్స్‌కు బుక్ రీడింగ్ అలవాటు ఉండాలి. మీరు చదివితే మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చదువుతారు. ఎందుకంటే.. పేరెంట్స్ చేసే పనులనే పిల్లలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి.. తల్లిదండ్రులు కూడా బుక్స్ చదువుతుండాలి. అలాఅని ఒక్కరోజులో మమ అనిపించకుండా రోజూ చదువుతుండాలి. అప్పుడే పిల్లలు కూడా మిమ్మల్ని ఫాలో అవుతారు.
మీ పిల్లలకు ఇవి చెబుతున్నారా? లేదా?
టైమ్ సెట్ చేసుకోవాలి:బుక్ రీడింగ్ చేయడానికి ఒక టైమ్ అనేది సెట్ చేసుకోవాలి. వీలున్నప్పుడు కాకుండా ఒక నిర్దిష్ట సమయం అనేది ఉంటే.. ఆటోమెటిక్‌గా ఆ సమయానికి బుక్ రీడింగ్ అలవాటు అవుతుంది. ఉదాహరణకు నైట్ పడుకునే సమయంలో లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత.. ఇలా టైమ్ సెట్ చేసుకోవాలి.
వివిధ పుస్తకాలు చదవండి:పిల్లలకు కథలు, కామెడీ పుస్తకాలు ఎక్కువగా ఇష్టముంటాయి. పేరెంట్స్ కూడా వాటినే ఎక్కువగా తీసుకొస్తుంటారు. అయితే పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన పుస్తకాలు కాకుండా కొత్త వాటిని కూడా అలవాటు చేయాలి. అలాగే వారు ఏ పుస్తకాలను ఎక్కువగా చదవడానికి ఇష్టపడుతున్నారో తెలుసుకుని వారికి అనుగుణంగా తీసుకురావాలి.
అలర్ట్ : మీ పిల్లలు ఆన్‌లైన్‌కు బానిసవుతున్నారా? - ఈ టిప్స్‌తో మీ దారిలోకి తెచ్చుకోండి!