Bank of Maharashtra Recruitment 2024 :బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 600 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- యూఆర్ - 305 పోస్టులు
- ఓబీసీ - 131 పోస్టులు
- ఈడబ్ల్యూఎస్ - 51 పోస్టులు
- ఎస్టీ - 48 పోస్టులు
- ఎస్సీ - 65 పోస్టులు
- మొత్తం పోస్టులు - 600
రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు :ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాంకు శాఖల్లో 11, తెలంగాణలోని బ్యాంకు శాఖల్లో 16 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు :అభ్యర్థులు ప్రభుత్వగుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- అభ్యర్థుల వయస్సు 2024 జూన్ 30 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10-15 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము :
- యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.150 + జీఎస్‌టీ చెల్లించాలి.
- ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుముగా రూ.100 + జీఎస్‌టీ చెల్లించాలి.
- దివ్యాంగులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది.