Bank of Baroda Recruitment 2024 : బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 592 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో అర్హతలేంటి? దరఖాస్తు ఫీజు ఎంత? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోస్టుల వివరాలు :రిలేషన్షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజినీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజినీర్, ప్రొడక్ట్ మేనేజర్
- ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్ - 140
- డిజిటల్ గ్రూప్ - 139
- రిసీవబుల్ మేనెజ్మెంట్ - 202
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - 31
- కార్పొరేట్, క్రెడిట్ విభాగం -79
- ఫైనాన్స్ - 1
- మొత్తం పోస్టులు - 592
విభాగాలు : ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్, రిసీవబుల్స్ డిపార్ట్ మెంట్, ఐటీ, సీ అండ్ ఐసీ, ఫైనాన్స్.
విద్యార్హతలు : సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.