Wife and Husband Financial Understanding : ఈ రోజుల్లో చాలా పెళ్లిళ్లు మధ్యలోనే పెటాకులు కావడానికి ప్రధాన కారణం.. ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరుగా ఉండడమే అంటున్నారు నిపుణులు. ఇందులోనూ ఆర్థిక విషయాలు ముందు వరసలో ఉంటున్నాయని చెబుతున్నారు. అందుకే.. పెళ్లికి ముందే భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలపై ఇద్దరూ మాట్లాడుకుంటే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం..
ఎంత సంపాదిస్తున్నా చాలట్లేదా? ఈ టిప్స్‌తో మినిమమ్ ఉంటది!
దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమిటి?:దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే.. ఇల్లు కొనడం, పెట్టుబడులు పెట్టడం లాంటివే కాకుండా.. కుటుంబ ప్రణాళికల గురించి కూడా చర్చించుకోవాలి. అంటే.. పెళ్లి తర్వాత పిల్లలు వెంటనే కావాలా..? వద్దా..? వారి ఫ్యూచర్ కోసం ఏమైనా ప్లాన్ చేస్తారా? భార్యాభర్తల ఉద్యోగాలు సంగతేంటి? పొదుపు ఎలా చేద్దాం? అనే విషయాలు ముందుగానే మాట్లాడుకొంటే ఓ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే.. పిల్లలు పుట్టిన తర్వాత పెంపకం నుంచి గ్రాడ్యుయేషన్ అయ్యేవరకు చాలా డబ్బు అవసరమవుతుంది. లైఫ్‌లో సెటిల్ అవ్వకుండానే పిల్లలు కావాలనుకుంటే.. వారి భవిష్యత్తును అంధకారంలో పడేసినట్లే అవుతుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా ఆర్థిక విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక లక్ష్యం నెరవేరాలా? భార్యాభర్తలు పాటించాల్సిన టాప్-9 ఫైనాన్సియల్ టిప్స్ ఇవే!
బడ్జెట్:చాలా మంది భార్యాభర్తలు ఎవరి సంపాదన వారిదే అన్నట్టుగా ఉంటారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి సంపాదన ఒక్కదగ్గర పెట్టి ఖర్చు చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల మేము వేర్వేరు కాదు.. ఇద్దరమూ ఒకటే అన్న భావన మరింతగా బలపడుతుందని సూచిస్తున్నారు. ఇది లేకపోతే.. ఎవరి డబ్బులు వారివే అన్నట్టుగా ఉంటే.. అపార్థాలు, దాపరికాలు పెరిగిపోయి చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. సంపాదనతో సహా ఏ విషయంలోనైనా భార్యాభర్తలు ఒక్కటిగానే ముందుకు సాగాలని, ఒకే మాట మీద ఉండాలని సూచిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏర్పడే ఈ అవగాహన ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసి ఎదుర్కొంటారని, తద్వారా.. వారిమధ్య ప్రేమ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.