How To Download Jeevan Pramaan Certificate online :కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులు నవంబర్ 30లోగా తమ 'జీవన్ ప్రమాణ్ పత్ర' (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించాలి. 80 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు అక్టోబర్ 1 నుంచే ఈ జీవన్ ప్రమాణ్ పత్రను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు. దీని వల్ల ఎలాంటి అంతరాయం లేకుండా నెలవారీ పింఛన్ పొందడానికి వీలవుతుంది.
Life Certificate Submission Date :సాధారణంగా ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అక్టోబరు 1 నుంచి నవంబరు 30 వరకు గడువు ఉంటుంది. పింఛనుదారులు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని ఉపయోగించి పత్రాలు సమర్పించవచ్చు. ఈ టెక్నాలజీ వినియోగంపై ప్రభుత్వం ఇప్పటికే అవగాహన కల్పించింది కూడా. అలాగే బయోమెట్రిక్స్ ఉపయోగించి కూడా ఆధార్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో వైబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళ ఆన్‌లైన్ విధానం మీకు తెలియకపోతే, నేరుగా మీ దగ్గర్లోని బ్యాంకును సందర్శించవచ్చు. లేదా డోర్‌స్టెప్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు.
సకాలంలో సమర్పించకపోతే?
గడువులోగా 'జీవన్ ప్రమాణ్ పత్ర'ను సమర్పించకపోతే, డిసెంబర్ నుంచి పెన్షన్ చెల్లింపు నిలిచిపోతుంది. ఒకవేళ నవంబర్ 30 తరువాత జీవన్ ప్రమాణ్ పత్రను సమర్పిస్తే, ఆ తరువాతి నెలలో, అప్పటి వరకు ఉన్న బకాయితో కలిపి మొత్తం పెన్షన్ అందిస్తారు.
ఒకవేళ పెన్షనర్ మూడు లేదా అంత కంటే ఎక్కువ సంవత్సరాల పాటు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించకపోతే, వారి పెన్షన్‌ను పూర్తిగా నిలిపివేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పెన్షన్‌ను పునరుద్ధరించాలంటే, సంబంధిత అధికారుల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ ద్వారా జీవన్ ప్రమాణ్ పత్రను సమర్పించడం ఎలా?
- గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి AadhaarFaceRD, Jeevan Pramaan Face Appలను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- తరువాత 'జీవన్ ప్రమాణ్ యాప్' ఓపెన్ చేసి చేయాలి.
- యాప్‌లో మీ ఆధార్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడి లాంటి వ్యక్తిగత వివరాలు నింపి, సబ్మిట్ చేయాలి.
- తర్వాత మీ మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- ఆధార్ కార్డులో ఉన్న పేరు ఎంటర్ చేసి స్కాన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆ యాప్ మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి కెమెరా పర్మిషన్ అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి.
- తర్వాత ‘I am aware of this’ అనే బటన్‌పై నొక్కాలి. తర్వాత మీ ఫేస్ స్కాన్ అవుతుంది.
- ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత, మీ వివరాలు సబ్మిట్ అయినట్లు చూపిస్తుంది. అంతే సింపుల్!
- తరువాత ఫోన్ స్క్రీన్‌పై పెన్షనర్ల ప్రమాణ్ ID, PPO నంబర్లు కనిపిస్తాయి.
- ఈ విధంగా స్మార్ట్‌ఫోన్‌లోనే మీ లైఫ్ సర్టిఫికెట్‌ను సులువుగా సమర్పించవచ్చు.