తెలంగాణ

telangana

ETV Bharat / business

బిట్‌కాయిన్‌ 'హావింగ్​' కంప్లీట్​ - ఇకపై లావాదేవీలు ఎలా జరుగుతాయంటే? - Bitcoin Halving - BITCOIN HALVING

What Is Bitcoin Halving : తాజాగా బిట్‌కాయిన్‌ 'హావింగ్​' ప్రక్రియ పూర్తయింది. దీంతో అంతటా ఆ టాపిక్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ బిట్‌కాయిన్‌ 'హావింగ్​' అంటే ఏమిటి ? అందులో ఏం చేస్తారు? ఈ ప్రక్రియ తర్వాత బిట్​కాయిన్ లావాదేవీల్లో ఏ మార్పు జరుగుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

bitcoin halving 2024
What Is Bitcoin Halving

By ETV Bharat Telugu Team

Published : Apr 22, 2024, 11:34 AM IST

What Is Bitcoin Halving : బిట్‌కాయిన్ - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ. శుక్రవారం నాడు బిట్‌కాయిన్‌ 'హావింగ్​' (Halving) ప్రక్రియ పూర్తయిందనే ప్రకటన వెలువడింది. దీంతో అంతటా ఆ టాపిక్‌పై చర్చ మొదలైంది. ఇంతకీ బిట్‌కాయిన్‌ 'హావింగ్​' ప్రక్రియ అంటే ఏమిటి ? అందులో భాగంగా ఏం చేస్తారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బిట్‌కాయిన్‌ 'హావింగ్​' అంటే ?
బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా కొత్త బిట్‌కాయిన్‌ల‌ను క్రియేట్ చేస్తుంటారు. అయితే ఈ కొత్త బిట్‌కాయిన్ల సృష్టిని తగ్గించే ఉద్దేశంతో దాదాపు ప్రతి నాలుగేళ్లకోసారి చేపట్టే ప్రక్రియనే బిట్‌కాయిన్‌ 'హావింగ్​' అంటారు. బిట్‌కాయిన్‌ను తొలుత క్రియేట్ చేసినప్పుడు మొత్తం 2.1 కోట్ల బిట్‌కాయిన్లే చలామణిలో ఉండాలని ఒక లిమిట్ పెట్టారు. అందుకని ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి కొత్త బిట్‌కాయిన్లను క్రియేట్ చేయడాన్ని తగ్గించేందుకు బిట్‌కాయిన్‌ 'హావింగ్​' కోడ్‌ను రూపొందించారు.

బిట్ కాయిన్ క్రియేషన్ ఇలా
How To Create Bitcoin :బిట్‌కాయిన్‌ మైనర్లు తమ కంప్యూటింగ్‌ పవర్‌ ద్వారా కఠినమైన మ్యాథ్స్​ పజిల్స్​ను పరిష్కరించి, బ్లాక్‌ చెయిన్‌ను రూపొందిస్తారు. తద్వారా కొత్త బిట్‌కాయిన్ల రూపంలో రివార్డులను పొందుతుంటారు. ఇలా బ్లాక్‌చెయిన్‌కు 2.1 కోట్ల బ్లాక్స్‌ జత అయిన ప్రతిసారి 'హావింగ్​' ప్రక్రియ జరిగేలా బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీని తయారు చేశారు. ఇలా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి చేస్తుంటారు. ప్రస్తుతం 1.9 కోట్ల బిట్‌కాయిన్‌లను మైనింగ్‌ ద్వారా చలామణిలోకి తెచ్చారు. ఇంకా 15 లక్షల బిట్‌కాయిన్లను మైనింగ్‌ చేయాల్సి ఉంది. హావింగ్​ ప్రక్రియ వల్ల బిట్‌కాయిన్ల సృష్టి నెమ్మదిస్తుంది. పైగా బిట్‌కాయిన్లను మైనింగ్‌ చేసే వాళ్లకు బిట్‌కాయిన్‌ రివార్డులు కూడా తగ్గిపోతాయి. శుక్రవారం రోజున బిట్‌కాయిన్‌ 'హావింగ్​' ప్రక్రియ పూర్తయిన అనంతరం, అది 0.47 శాతం నష్టపోయి రూ.53 లక్షల (63,747 డాలర్ల) వద్ద కదలాడింది. ఈ ఏడాది మార్చిలో బిట్‌కాయిన్‌ రూ.61 లక్షల (73,803.25 డాలర్ల) వద్ద జీవిత కాల గరిష్ఠాన్ని తాకింది.

ఇంతకీ క్రిప్టోకరెన్సీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ అనేది డిజిటల్​ (వర్చువల్) కరెన్సీ. ఇవి ప్రత్యేక సాఫ్ట్​వేర్​ కోడ్​ల ద్వారా పని చేస్తుంటాయి. సాధారణ కరెన్సీలు (రూపాయి, డాలర్​ వంటివి) భౌతికంగా చలామణి అవుతుంటాయి. క్రిప్టో కరెన్సీలు మాత్రం భౌతికంగా కనిపించవు, వాటిని ముట్టుకోలేం. ఇవి పూర్తిగా డిజిటల్​ రూపంలో మాత్రమే ఉంటాయి. పేరుకు తగ్గట్లుగానే క్రిప్టోగ్రఫీ, బ్లాక్​ చైన్​ సాంకేతికతలు క్రిప్టోకరెన్సీకి మూలాధారాలు. ప్రస్తుతం బిట్​కాయిన్​, ఇథీరియం, స్టెల్లార్, రిపుల్, డాష్​​ సహా పలు ఇతర క్రిప్టోకరెన్సీలు మనుగడలో ఉన్నాయి. వీటన్నింటిలో బిట్​కాయిన్​ అత్యంత ఆధరణ పొందిన క్రిప్టో కరెన్సీ.

బ్లాక్​ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి?
క్రిప్టోకరెన్సీ ప్రస్తావన వచ్చినప్పుడు మనం చాలా సార్లు క్రిప్టోగ్రఫీ టెక్నిక్స్, బ్లాక్​ చైన్ సాంకేతికత గురించి వింటూనే ఉన్నాం. బ్లాక్​చైన్​ అనేది డేటా బైస్​ ఆధారంగా పని చేసే ఓ ప్రత్యేక సాంకేతికత. ఇందులో సమాచారం అనేది బ్లాకులుగా విభజన చెంది ఉంటుంది. అదంతా ప్రపంచవ్యాప్తంగా వేరువేరు సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది.

ఇలా ఒక సర్వర్​కు మరో సర్వర్​ అనుసంధానమై ఈ వ్యవస్థ పని చేస్తుంది. ఈ కారణంగా బ్లాక్ చైన్ రూపంలో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని ఎంతటి హ్యాకర్లయినా తస్కరించడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే క్రిప్టోకరెన్సీలను ఎవరూ నియంత్రించడం కూడా జరగదు. దీనితో పాటు అవి అత్యంత సురక్షితమనే వాదన కూడా ఉంది.

బిట్​కాయిన్​ పొందడం ఎలా?
బిట్​కాయిన్​ను వర్ణించాలంటే డిజిటల్​ గోల్డ్​గా చెప్పవచ్చు. ఎందుకంటే బిట్​ కాయిన్​, బంగారం రెండూ అంత సులభంగా దొరకవు. వాటిని వెలికి తీయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొనాలంటే భారీగా ఖర్చవుతుంది.

బంగారం భౌతికంగా భూమిలో ఉంటుంది. దీన్ని పొందేందుకు మైనింగ్ చేయాల్సి ఉంటుంది. అదే తరహాలో కొత్త బిట్​కాయిన్ల కోసం కంప్యూటర్ల ద్వారా మైనింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఎంతో క్లిష్టమైన క్రిప్టోగ్రఫీ సమస్యలను పరిష్కరించడం ద్వారా కొత్త బిట్​కాయిన్​లను రివార్డుగా పొందొచ్చు. చలామణిలోకి (డిజిటల్​గా) వచ్చే బిట్​కాయిన్​ల సంఖ్య పెరిగే కొద్ది, కొత్త సమస్యలు పరిష్కరించే వారికి రివార్డుగా వచ్చే కాయిన్లు తగ్గుతాయి. ఇదే సమయంలో పరిష్కరించాల్సిన సమస్యలు మరింత క్లిష్టంగా మారుతుంటాయి. ఒకానొక దశ తర్వాత కొత్త బిట్​కాయిన్​లు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. మొత్తం మీద 2.1 కోట్ల బిట్​కాయిన్​లు మాత్రమే మనుగడలో ఉంటాయి.

బిట్​కాయిన్​ రూపకర్త ఎవరు?
బిట్​కాయిన్​ జపాన్​కు చెందిన షాతోషీ నాకామోటో అనే టెకీ రూపొందించినట్లు ప్రచారంలో ఉంది. అయితే దీనిపై స్పష్టత లేదు. 2009లో బిట్​కాయిన్​ మనుగడలోకి వచ్చింది. రూపాయికి 100 పైసలు ఎలానో, ఒక బిట్​కాయిన్​కు 100 షాతోషీలు ఉంటాయి.

రిటైర్​మెంట్ ప్లాన్​ - ఈ టిప్స్​ పాటిస్తే 'ఎక్స్​ట్రా పెన్షన్' గ్యారెంటీ! - EPFO Pension Rules

బెస్ట్​ స్పోర్ట్స్​ బైక్​ కొనాలా? టాప్​-5 ఆప్షన్స్​ ఇవే? - Best Sports Bikes

ABOUT THE AUTHOR

...view details