Upcoming Tata Cars In India 2024 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు సూపర్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్‌తో, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తెస్తుంటుంది. అందులో భాగంగా 2024, 2025 సంవత్సరాల్లోనూ తమ సరికొత్త బ్రాండెడ్ కార్లను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఆ మోడల్ కార్లు ఏంటి? వాటి ధర ఎంత ఉంటుంది? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. Tata Punch Facelift :టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ ఏడాది నవంబరులో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 4 వేరియంట్లలో ఈ వాహనం అందుబాటులో ఉండనుంది. న్యూ రేడియేటర్ గ్రిల్, రియర్ బంపర్లు, రీడిజైన్ చేసిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్‌తో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి రానుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ఫీచర్లు దీనిలో ఉంటాయని సమాచారం. 1.2 లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారు రానుంది. ఈ కారు ధర రూ.6 లక్షలు - రూ.11 లక్షలు ఉంటుందని అంచనా.
2. Tata Curvv : టాటా కర్వ్ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ కారు ఈ ఏడాది డిసెంబరులో మార్కెట్లో లాంఛ్ కానున్నట్లు సమాచారం. 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో కూడిన పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఈ కారులో ఉండనున్నాయి.
3. Tata Harrier EV :టాటా హారియర్ ఈవీ కారు 2025 మార్చిలో మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. దీని ధర మార్కెట్లో రూ.24 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, న్యూ రియర్ బంపర్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఈ కారులో ఉండనున్నాయి. ఈ కారు లోపలి భాగంలో 10.25 అంగుళాల స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.
4. Tata Safari EV :టాటా సఫారీ ఈవీ ధర రూ.26 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ కారు వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ కారు కొత్త స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్, న్యూ అల్లాయ్ వీల్స్‌తో మార్కెట్లోకి రానుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు వంటివి ఈ టాటా సఫారీ ఈవీలో ఉండనున్నాయి.