తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.2లక్షల్లో మంచి టూ-వీలర్​ కొనాలా? త్వరలో లాంఛ్ కానున్న టాప్-10 మోడల్స్ ఇవే! - Upcoming Bikes Under 2 Lakh

Upcoming Bikes Under 2 Lakh : బైక్ లవర్స్​కు గుడ్ న్యూస్. త్వరలోనే ఇండియన్ మార్కెట్లో పెద్దసంఖ్యలో బైక్స్, స్కూటర్స్ లాంఛ్ కానున్నాయి. వీటిలో రూ.2లక్షల బడ్జెట్లో మన ముందుకు రానున్న టాప్-10 మోడల్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

Upcoming Two wheelers Under 2 Lakh
Upcoming Bikes Under 2 Lakh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 1:43 PM IST

Upcoming Bikes Under 2 Lakh :త్వరలో వివిధ కంపెనీలకు చెందిన టాప్​ బైక్స్, స్కూటర్స్ భారత మార్కెట్లో లాంఛ్ కానున్నాయి. ఈ జాబితాలో హీరో, యమహా, హోండా, టీవీఎస్​ సహా పలు ప్రముఖ కంపెనీల టూ-వీలర్స్​​ ఉన్నాయి. వీటిలో రూ.2 లక్షల బడ్జెట్లో లభించే టాప్-10 బైక్స్ & స్కూటర్స్ గురించి ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

1. Hero Xtreme 200 R
హీరో ఎక్స్​ట్రీమ్ 200 ఆర్ బైక్ ఈ ఏడాది సెప్టెంబరులో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారుగా రూ.1.35లక్షలు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ బైక్​లో 199.6 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజిన్​ను అమర్చారు. ఇది 19.1 పీఎస్ పవర్, 17.35 ఎన్ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డిస్క్ బ్రేకులతో వస్తుంది.

2. Kinetic Green Electric Scooter
ఈ మోడల్ స్కూటర్ చాలా స్టైలిష్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ ఏడాది అక్టోబరులో లాంఛ్ కానున్నట్లు సమాచారం. ఆప్రాన్ మౌంటెడ్ హెడ్‌ లైట్, సింగిల్ పీస్ సీటు, సొగసైన గ్రా బ్రెయిల్స్, విశాలమైన ఫ్లోర్‌ బోర్డ్ వంటి ఫీచర్లు ఈ ఈవీలో ఉండనున్నట్లు అంచనా. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ ఈవీతో 120 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చు. గంటకు 72 కి.మీ వేగంతో ఈ ఈవీపై ట్రావెల్ చేయవచ్చు. కైనెటిక్ గ్రీన్ ఈవీ ధర రూ.1.09 లక్షల వరకు ఉంటుందని అంచనా.

3. Hero Adventure Scooter
హీరో అడ్వెంచర్ స్కూటర్ ధర రూ.1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ ఏడాది నవంబరులో ఈ స్కూటర్​ను మార్కెట్లోకి తీసుకురావాలని హీరో కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ అడ్వెంచర్ స్కూటర్ బీఎస్​5 - 2.0 ఇంజిన్​తో పనిచేస్తుంది. దీనికి ఫ్రంట్, బ్యాక్ బ్రేక్స్ ఉండనున్నాయి.

4. Yamaha NMax 155
యమహా కంపెనీ ఈ స్కూటర్​ను ఈ ఏడాది డిసెంబర్​ నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ధర రూ.1.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. 155 సీసీ ఇంజిన్​తో ఈ స్కూటర్ లభిస్తుంది. ఇది 15 పీఎస్ పవర్, 14.4 ఎన్ఎం టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీని కెర్బ్ వెయిట్ 127 కిలోలు. డబుల్ డిస్క్ బ్రేకులు, ట్యూబ్​లెస్ టైర్లతో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.

5. Yamaha XSR155
యమహా ఎక్స్ఎస్ఆర్ 155 బైక్ ఈ ఏడాది డిసెంబరులో లాంఛ్ కానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ బైక్ ధర రూ.1.40 లక్షల వరకు ఉంటుంది. 155 సీసీ ఇంజిన్​తో ఈ బైక్ లభిస్తుంది. 19.3 పీఎస్ పవర్, 14.7 ఎన్ఎం టార్క్​ను జనరేట్ చేస్తుంది. డిస్క్ బ్రేకులు, ట్యూబ్​లెస్ టైర్లతో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది.

6. Honda Activa Electric
హోండా యాక్టివా ఈవీ ధర రూ.1.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇది వచ్చే ఏడాది జనవరిలో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. మంచి పికప్​తో ఈ స్కూటర్ రానున్నట్లు సమాచారం. హోండా యాక్టివా వేరియంట్​లో రానున్న మొదటి ఈవీ మోడల్ ఇదే. అందుకే దీనిపై బాగా అంచనాలు ఉన్నాయి.

7. Hero Xoom 160
హీరో జూమ్ 160 బైక్ వచ్చే ఏడాది మార్చిలో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.1.45 లక్షల వరకు ఉంటుందని అంచనా. 156 సీసీ ఇంజిన్​తో ఈ బైక్ లభిస్తుంది. డ్యూయల్ ఛాంబర్ ఎల్ఈడీ హెడ్​లైట్, స్ల్పిట్ ఎల్ఈడీ టైల్‌ లైట్లు, స్మార్ట్ కీతో కూడిన కీలెస్ ఇగ్నిషన్ ఫీచర్, డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఈ బైక్​కు ఉంటాయి.

8. TVS ADV
ఈ బైక్ ధర దాదాపుగా రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. వచ్చే ఏడాది మార్చిలో ఇది లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. 106 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ఈ బైక్ లభిస్తుంది. అలాగే 77.6 పీఎస్ పవర్, 7.85 ఎన్ఎం టార్క్​ను విడుదల చేస్తుంది. దీని కెర్బ్ వెయిట్ 119 కేజీలు.

9. Bajaj Avenger 400
బజాజ్ అవెంజర్ 400 బైక్ 373 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో లభిస్తుంది. అలాగే 35 పీఎస్ పవర్, 35ఎన్ఎం టార్క్​ను విడుదల చేస్తుంది. ఈ బైక్ డబుల్ డిస్క్ బ్రేక్​లు, ట్యూబ్​లెస్ టైర్లను కలిగి ఉంటుంది. స్పీడో మీటర్, ఓడో మీటర్, టాకో మీటర్, ట్రిప్‌ మీటర్‌ వంటి ఫీచర్లు ఈ బైక్​లో ఉంటాయి. దీని ధర రూ.1.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఈ బైక్​ను ఎప్పుడు లాంఛ్ చేయనున్నారనే విషయాన్ని బజాబ్ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

10. KTM Electric Scooter
కేటీఎం కంపెనీ మంచి స్టైలిష్​గా ఉండే ఎలక్ట్రిక్ ఈవీని మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. బహుశా ఈ బైక్ ధర రూ.1.50 లక్షలు ఉంటుందని అంచనా. ఈ స్కూటర్​ను భారత మార్కెట్లోకి ఎప్పుడు తీసుకొస్తారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

మీ కారు తరచూ ట్రబుల్​ ఇస్తోందా? ఇలా మెయింటెన్​ చేస్తే ఫుల్​ కండీషన్​లో పెట్టొచ్చు! - Car Maintenance Checklist

కొత్త కారు కొనాలా? మీ బడ్జెట్ రూ.10లక్షలా? బెస్ట్-5 అప్​కమింగ్ మోడల్స్ ఇవే! - Best Upcoming Cars Under 10 Lakhs

ABOUT THE AUTHOR

...view details