Bike Self Start Problem : మీరు ఉదయాన్నే లేచి, చక్కగా రెడీ అయ్యి ఆఫీస్‌కు బయలుదేరారు. కానీ మీ బైక్/ స్కూటీ మాత్రం ఎంత ట్రై చేసినా స్టార్ట్ కావడం లేదు. మీ దగ్గర మరో బండి కూడా లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లమ్‌ను ఎలా పరిష్కరించాలి? అనేది ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
వింటర్లో మీ బైక్‌కు సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లమా? ఈ 5 టిప్స్ పాటిస్తే అంతా సెట్!
మీ బైక్ సెల్ఫ్ స్టార్ట్ సరిగ్గా పనిచేయడం లేదా? ఈ 5 టిప్స్ మీ కోసమే!
Bike (ETV Bharat)
Published : Nov 25, 2024, 5:08 PM IST
శీతాకాలంలో బైక్/ స్కూటర్ - సెల్ఫ్ స్టార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎంతలేదన్నా అవి మెషిన్స్ కాబట్టి ఇలాంటి సమస్యలు రావడం సహజమే. అయితే కొన్ని మెయింటెనెన్స్ టిప్స్, ఫాలో-అప్స్ పాటించడం ద్వారా ఈ సమస్యను చాలా సులువుగా పరిష్కరించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- శీతాకాలంలో తీవ్రమైన చలి ఉంటుంది కనుక ఉదయం, సాయంత్రం వేళల్లో బైక్‌పై వెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చాలా మంది శీతాకాలంలో బైక్స్‌ను పెద్దగా వాడరు. దీని వల్ల ఇంజిన్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు ప్రతి రోజూ కొన్ని నిమిషాలపాటైనా బైక్ ఇంజిన్‌ను స్టార్ట్ చేస్తుండాలి.
- బైక్ బాగా నడవాలంటే, రెగ్యులర్‌గా ఇంజిన్ ఆయిల్‌ను మారుస్తూ ఉండాలి. శీతాకాలంలో ఇంజిన్ ఆయిల్ బాగా చిక్కబడే అవకాశం ఉంటుంది. దీని ప్రభావం ఇంజిన్‌పై కచ్చితంగా పడుతుంది. కనుక నిర్ణీత సమయంలోపు తరచుగా ఇంజిన్ ఆయిల్ మారుస్తూ ఉండాలి.
- ఒకప్పుడు బైక్ స్టార్ట్ చేయాలంటే కిక్ రాడ్‌ను గట్టిగా కొట్టాల్సి ఉండేది. కానీ లేటెస్ట్ మోటార్ సైకిళ్లలో చాలా వరకు ఈ కిక్-స్టార్టర్లు ఉండడం లేదు. దానికి బదులుగా ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విఛ్‌లు ఉంటున్నాయి. శీతాకాలంలో ఇవి కొన్ని సార్లు పని చేయకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో, ఒక వేళ బండిలో కిక్-స్టార్టర్ ఉంటే దానిని ఉపయోగించడం మంచిది.
- టూ-వీలర్స్‌లో అత్యంత ముఖ్యమైనది స్పార్క్ ప్లగ్. ఇది క్లీన్‌గా ఉంటేనే బండి చక్కగా స్టార్ట్ అవుతుంది. లేకుంటే ఇంజిన్ స్టార్ట్ చేయడానికి వీలుపడదు. కనుక స్పార్క్ ప్లగ్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలా చూసుకోవాలి.
- బైక్/ స్కూటీల్లోని బ్యాటరీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇగ్నిషన్ సరిగ్గా ఉండాలంటే - బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌లో, వైర్స్ మంచి కండిషన్లో ఉండాలి. లేకుంటే బండి స్టార్ట్ కాదు. ఒకవేళ మీ బండిలో బ్యాటరీ, వైర్స్ సమస్యలు ఉంటే, కచ్చితంగా మంచి మెకానిక్ దగ్గరకు వెళ్లి వాటిని రిపేర్ చేయించాలి. ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే, శీతాకాలంలో కూడా మీ బైక్‌కు సెల్ఫ్ స్టార్ట్ సమస్య రాకుండా ఉంటుంది.