Stock Market Close :బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీనితో నిఫ్టీ 50 పద్నాలుగు రోజుల రికార్డ్ ర్యాలీకి బ్రేక్ పడింది.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 202 పాయింట్లు నష్టపోయి 82,352 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 81 పాయింట్లు కోల్పోయి 25,198 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : ఏసియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలివర్, ఆల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా
- నష్టపోయిన షేర్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్
Stock Market Today September 4, 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. దీనితో నిఫ్టీ 50 సాధించిన 14 రోజుల రికార్డ్ లాభాలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండడం, మదుపరులు లాభాలు స్వీకరిస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 377 పాయింట్లు నష్టపోయి 82,178 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఏసియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎం అండ ఎం, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, టాటా స్టీల్