Stock Market Close :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడమే ఇందుకు కారణం.
చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1303 పాయింట్లు లాభపడి 80,436 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 397 పాయింట్లు వృద్ధి చెంది 24,541 వద్ద ముగిసింది.
- లాభపడిన షేర్లు :టెక్ మహీంద్రా, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, టీసీఎస్, ఆల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఐటీసీ
- నష్టపోయిన షేర్లు : సన్‌ఫార్మా
అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్
ఇటీవల మార్కెట్లో లిస్ట్ అయిన ఓలా ఎలక్ట్రిక్ 20 శాతం మేర వృద్ధిచెంది, మదుపరులకు భారీ లాభాలను అందించింది. అలాగే టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, టీసీఎస్‌లు కూడా బాగా రాణించాయి.
03:15 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1403 పాయింట్లు లాభపడి 80,505 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 414 పాయింట్లు వృద్ధి చెంది 24,558 వద్ద ట్రేడవుతోంది.
12:45 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1015 పాయింట్లు లాభపడి 80,111 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 306 పాయింట్లు వృద్ధి చెంది 24,450 వద్ద ట్రేడవుతోంది.
12:00 PM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 776 పాయింట్లు లాభపడి 79,882 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 237 పాయింట్లు వృద్ధి చెంది 24,381 వద్ద ట్రేడవుతోంది.
Stock Market Today August 16, 2024 :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 805 పాయింట్లు, నిఫ్టీ 252 పాయింట్లు మేర లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాలు కూడా మంచి లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 738 పాయింట్లు లాభపడి 79,841 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 215 పాయింట్లు వృద్ధి చెంది 24,359 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న షేర్లు : ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టైటాన్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, సన్‌ఫార్మా
అమెరికాలో సీపీఐ డేటా ప్రకారం, ఫెడ్ నిర్దేశిత 2 శాతం వద్దకు ద్రవ్యోల్బణం చేరుకోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంచాయి. ఇక బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రికవరీని కొనసాగిస్తోంది. గతేడాది మాంద్యం బారినపడిన ఈ దేశం ఏప్రిల్-జూన్‌లో 0.6% వృద్ధిని నమోదు చేసినట్లు గురువారం అధికారిక గణాంకాలు వెల్లడించాయి. జనవరి-మార్చిలో 0.7% వృద్ధి చెందిన ఈ దేశం, రెండో త్రైమాసికంలోనూ వృద్ధిని కొనసాగించడం కొత్తగా కొలువుతీరిన బ్రిటన్ ప్రభుత్వానికి మద్దతు పలికే అంశమే.
అంతర్జాతీయ మార్కెట్లు
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
FIIs Investments :స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2595.27 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు. మరోవైపు దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,236.21 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
Rupee Open August 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.94గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 16, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.25 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.84 డాలర్లుగా ఉంది.
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today
వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- రెపోరేటు యథాతథం - RBI 2024 Repo rate