Stock Market Today April 1st 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. తరువాత కొద్ది సేపటికే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 74,254 వద్ద, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 22,529 వద్ద జీవన కాల గరిష్ఠాలను తాకాయి. దీనితో నూతన ఆర్థిక సంవత్సరానికి శుభారంభం జరిగినట్లు అయ్యింది. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 495 పాయింట్లు లాభపడి 74,146 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 177 పాయింట్లు వృద్ధిచెంది 22,504 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్,
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్
విదేశీ పెట్టుబడులు
FIIs Investment In India : స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.188.31 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు ప్రకటించారు. తరువాత శని, ఆదివారాలు వచ్చాయి. దీనితో సోమవారం స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ మొదలైంది.
ఆసియా మార్కెట్లు
Asian Markets April 1st 2024 : ఏసియన్ మార్కెట్లలో సియోల్, షాంఘై భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టోక్యో మాత్రం నష్టాల్లో ట్రేడవుతోంది. గురువారం వాల్‌స్ట్రీట్ మిక్స్డ్ నోట్‌తో ముగిసిన విషయం తెలిసిందే!