Stock Market Today 30 January 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. మదుపరులు లాభాలు స్వీకరించడం సహా, త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త ఆచితూచి వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 801 పాయింట్లు నష్టపోయి 71,139 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 21,522 వద్ద ముగిసింది.
లాభపడిన స్టాక్స్ : టాటా మోటార్స్, హిందూస్థాన్ యూనిలీవర్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్
నష్టపోయిన షేర్స్ :బజాజ్ ఫైనాన్స్, టైటాన్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, రిలయన్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఆసియా మార్కెట్లు
Asian Markets30 Today January 2024 : టోక్యో మార్కెట్లు మంచి లాభాలతో ముగిశాయి. సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు మాత్రం భారీగా నష్టపోయాయి. మరోవైపు యూరోపియన్ మార్కెట్లు మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
FII Investments Today 30 January 2024 :స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సోమవారం రూ.110.01 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
ముడిచమురు ధర
Crude Oil Price Today 30 January 2024 :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.21 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ ముడిచమురు ధర 82.57 డాలర్లుగా ఉంది.
రూపాయి విలువ
Rupee Value Today 30 January 2024 :మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 5 పైసలు పెరిగింది. ప్రస్తుతం యూఎస్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.11గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices 30th January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్ - బస్, ఫ్లైట్ బుకింగ్స్‌పై 100% క్యాష్ బ్యాక్!
2024లో లాంఛ్ కానున్న టాప్-10 ఈవీ కార్స్ ఇవే! వీటి రేంజ్ ఎంతంటే?