దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్@79551 ఆల్ టైమ్ హై- జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ - Stock Market Live Updates - STOCK MARKET LIVE UPDATES
![దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్@79551 ఆల్ టైమ్ హై- జీవనకాల గరిష్ఠాన్ని తాకిన నిఫ్టీ - Stock Market Live Updates Stock Market Live Updates](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-06-2024/1200-675-21815230-thumbnail-16x9-stock.jpg)
Published : Jun 28, 2024, 9:54 AM IST
Stock Market Live Updates : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా దూసుకెళ్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 308.49 పాయింట్ల లాభంతో 79,551 ఆల్ టైమ్ హై రికార్డ్ నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 103.75 పాయింట్లు పెరిగి జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.
లాభాల్లో ఉన్న స్టాక్స్ :30 సెన్సెక్స్ కంపెనీల్లో సన్ ఫార్మా, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్, నెస్లే అత్యధికంగా లాభపడ్డాయి.
నష్టాల్లో ఉన్న స్టాక్స్ : అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు గురువారం పాజిటివ్‌గా ముగిశాయి.