తెలంగాణ

telangana

ETV Bharat / business

అదరగొట్టిన స్టాక్ మార్కెట్లు - రికార్డ్ లాభాలతో ముగిసిన సెన్సెక్స్ & నిఫ్టీ! - Stock Market Close Today - STOCK MARKET CLOSE TODAY

Stock Market Close Today July 3, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్​, నిఫ్టీలు రికార్డ్ లాభాలతో ముగిశాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్​ స్టాక్స్​ బాగా రాణించాయి.

stock market
bull market (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 3:41 PM IST

Stock Market Close Today July 3, 2024 :బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డ్ లాభాలతో ముగిశాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 545 పాయింట్లు లాభపడి 79,986 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 162 పాయింట్లు వృద్ధిచెంది 24,286 వద్ద ముగిసింది.

చరిత్ర సృష్టించిన సెన్సెక్స్​
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ గురువారం 559 పాయింట్లు లాభపడి 80,001 వద్ద లైఫ్​ టైమ్ హై రికార్డ్​​ను నమోదు చేసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 172 పాయింట్లు వృద్ధి చెంది 24,296 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్​ చేసింది.

  • లాభపడిన స్టాక్స్​ : అదానీ పోర్ట్స్, కొటక్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్ బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ జర్వ్, ఐటీసీ, మారుతి, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, అల్ట్రా సెమ్కో, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్,
  • నష్టపోయిన షేర్స్​ : ఎల్ అండ్ టీ, టాటా మోటార్స్, రిలయన్స్, టైటాన్, టీసీఎస్గత 3 నెలలుగా సెన్సెక్స్ అదుర్స్

3 నెలలుగా లాభాల పంట
గత 3 నెలల కాలంలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 5వేల పాయింట్లు లాభపడింది. నరేంద్ర మోదీ భారత ప్రధానిగా ప్రమాణం స్వీకారం చేసిన జూన్ 9 తర్వాత 3వేలు పాయింట్లు లాభపడింది. బుధవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభం నుంచే లాభాల్లో కొనసాగడం వల్ల సెన్సెక్స్ 80 వేల మార్క్​ను దాటి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గత కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలబాట పడుతున్నాయి.

ప్రధాని మోదీ ప్రమాణం తర్వాత అదుర్స్!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 9 తర్వాత మార్కెట్​లో ర్యాలీ ఊపందుకుంది. ప్రధాని ప్రమాణం తర్వాత రోజే సెన్సెక్స్ 77 వేల మార్కును దాటింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 9న సెన్సెక్స్ తొలిసారిగా 75,000 మైలురాయిని తాకింది. మే 27న 76 వేల మార్కును టచ్ చేసింది. జూన్ 10న 77 వేల పాయింట్లు, మరో 15 రోజుల్లోనే అంటే జూన్ 25న సెన్సెక్స్ 78 వేల మార్కును అందుకుంది. జూన్ 29న 79 వేల పాయింట్లకు చేరుకుంది సెన్సెక్స్. అనుకూలమైన ఆర్థిక విధానాలు, మార్కెట్లపై పెట్టుబడిదారుల విశ్వాసం ఉంచడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు అదరగొడుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. "సెన్సెక్స్ 10,000 పాయింట్లు పెరిగి 80 వేలు వద్ద జీవితకాల గరిష్ఠానికి దాదాపు 7 నెలలు పట్టింది. ఈ జీవితకాల గరిష్ఠ స్థాయి మార్కెట్​లకు మరిన్ని నిధులను ఆకర్షిస్తుంది" అని బ్యాంకింగ్, మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా తెలిపారు.

బంగారంపై పెట్టుబడి పెడితే ఫుల్ ప్రాఫిట్​ - అన్నింటి కంటే అదే టాప్​!

బ్యాంక్​ కస్టమర్లకు అలర్ట్​- 13గంటల పాటు సేవలు బంద్! ఎప్పుడో తెలుసా? - hdfc bank services down

ABOUT THE AUTHOR

...view details