తెలంగాణ

telangana

ETV Bharat / business

స్పెక్ట్రమ్‌ వేలంలో రూ.11.3 వేల కోట్ల విక్రయాలు- టాప్​ బిడ్డర్​గా భారతీ ఎయిర్‌టెల్ - spectrum auction 2024 - SPECTRUM AUCTION 2024

Spectrum Auction 2024 : టెలికాం స్పెక్ట్రమ్‌ వేలం కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. మొత్తం ఏడు రౌండ్లలో రూ.11,340 కోట్ల విలువైన స్పెక్ట్రామ్​ మాత్రమే అమ్ముడుపోయినట్లు అధికారులు ప్రకటించారు. అధికంగా ఎయిర్​టెల్ కొనుగోలు చేసింది.

spectrum auction 2024
spectrum auction 2024 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 8:25 AM IST

Spectrum Auction 2024: మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌, డేటా కోసం కేంద్రం నిర్వహించిన టెలికాం స్పెక్ట్రమ్‌ వేలంలో సునీల్​ భారతీ మిత్తల్​కు చెందిన ఎయిర్​టెల్ టాప్​ బిడ్డర్​గా నిలిచింది. రూ.6,856.76 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం రూ.96,238 కోట్ల విలువైన 10 గిగాహెర్ట్జ్‌ కోసం వేలం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేలంలో మొత్తం ఏడు రౌండ్లలో 12 శాతానికి మాత్రమే అంటే రూ.11,340 విలువైన స్పెక్ట్రమ్​ మాత్రమే టెలికాం కంపెనీలు కొనుగోలు చేశాయి.

ఈ వేలంలో జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కంపెనీ పాల్గొన్నాయి. ఇందులో ఎయిర్​టెల్ రూ.6856.76 కోట్ల విలువైన స్పెక్ట్రరమ్ కొనుగోలు చేసి టాప్​లో నిలిచింది. ఇక ముకేశ్‌ అంబానీకి చెందిన జియో రూ.973.2 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.3510.4 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్న 900-1800 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌లను తిరిగి కొనుగోలు చేశాయి.

రెండు రోజులకే ముగింపు
ఈ వేలం ప్రక్రియను జూన్ 25( మంగళవారం) ప్రారంభించారు. మొదటి రోజు మొత్తం 5 రౌండ్లలో సుమారు రూ.11,000 విలువైన బిడ్లను టెలికాం కంపెనీలు సమర్పించాయి. ఇక బుధవారం రెండు రౌండ్లలో రూ.350 కోట్ల స్పెక్ట్రమ్​ కోసమే బిడ్లు దాఖలైయ్యాయి. దీంతో అధికారులు చేసేది ఏమి లేక ఉదయం 11:30 గంటలకే వేలం ముగిసినట్లు ప్రకటించారు. అంచనాలకు తగ్గట్లుగానే వేలం ప్రక్రియ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. టెలికాం కంపెనీలు స్పెక్ట్రమ్‌ కాంట్రాక్టుల పునరుద్ధరణపై దృష్టి పెట్టడం, తమ కవరేజీ పెంచుకోవడానికి ఉపయోగపడే స్పెక్ట్రమ్‌పైనే ఆధారపడడం ఇందుకు కారణమని చెబుతున్నారు.

ఏడు రోజుల వేలం
చివరిసారిగా 2022లో నిర్వహించిన స్పెక్ట్రమ్‌ వేలం ఏడు రోజుల పాటు జరిగింది. మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ను టెలికాం కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో జియో టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. సుమారు రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను ఆ కంపెనీ దక్కించుకుంది. ఎయిర్‌టెల్‌ రూ.43,084, వొడాఫోన్‌ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేశాయి.

సేవింగ్స్ అకౌంట్​లో ఎంత డిపాజిట్ చేయొచ్చు? లిమిట్ దాటితే ఏమవుతుంది? - Cash Deposit Limit

రెండో రోజూ అదే దూకుడు- లైఫ్​టైమ్ హై వద్ద స్టాక్ మార్కెట్లు

ABOUT THE AUTHOR

...view details