Stock Market Close :రోజంతా తీవ్రమైన ఒడుదొడుకుల్లో కొనసాగిన స్టాక్ మార్కెట్లు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 34 పాయింట్లు నష్టపోయి 79,441 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 18 పాయింట్లు కోల్పోయి 24,123 వద్ద ముగిసింది. ఇవాళ ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ నష్టపోగా, ఐటీ స్టాక్స్ రాణించాయి.
- లాభపడిన షేర్లు :ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, రిలయన్స్, సన్‌ఫార్మా
- నష్టపోయిన షేర్లు :భారతీ ఎయిర్టెల్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్
1:00 PM :స్టాక్ మార్కెట్లు తీవ్రమైన ఒడుదొడుకులతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 180 పాయింట్లు నష్టపోయి 79,302 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 74 పాయింట్లు కోల్పోయి 24,067 వద్ద కొనసాగుతోంది.
12:00 PM :స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 57 పాయింట్లు లాభపడి 79,522 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 33 పాయింట్లు వృద్ధి చెంది 24,175 వద్ద కొనసాగుతోంది.
10:30 AM :ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 11 పాయింట్లు నష్టపోయి 79,465 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 5 పాయింట్లు కోల్పోయి 24,136 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today July 2, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లైఫ్ హై లెవల్స్‌ను క్రాస్ చేశాయి. కానీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 225 పాయింట్లు నష్టపోయి 79,258 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయి 24,099 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్‌గ్రిడ్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి