Scooters Under 90000 :భారతదేశంలో స్కూటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే యువతీ, యువకుల నుంచి పెద్దవాళ్ల వరకు, అందరకీ డ్రైవ్ చేయడానికి అనువుగా ఉండడమే ఇందుకు కారణం. అందుకే ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ తమ లేటెస్ట్ స్కూటర్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలో మంచి మైలేజ్ ఇచ్చే టాప్-10 స్కూటీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Honda Activa 6G :భారతదేశంలోని అత్యంత పాపులర్ స్కూటర్లలో హోండా యాక్టివా 6జీ ఒకటి. దీనిపై గంటకు 85 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్‌తో 50 కి.మీ వరకు హాయిగా ప్రయాణించవచ్చు. ఈ స్కూటీ 5 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.51 సీసీ
- మ్యాక్స్ పవర్ : 7.84 PS@ 8000 rpm
- మ్యాక్స్ టార్క్ : 8.90 Nm@ 5500 rpm
- ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- స్పీడ్ : 85 కి.మీ/ గంట
- ధర : రూ.76,234 - రూ.82,734
2. Suzuki Access 125 : అర్బన్ ఏరియాల్లో ప్రయాణించడానికి సుజుకి యాక్సెస్ 125 చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చాలా స్లీక్గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.0 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.7 PS@ 6750 rpm
- మ్యాక్స్ టార్క్ : 10 Nm@ 5500 rpm
- ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్
- మైలేజ్ : 45 కి.మీ/ లీటర్
- స్పీడ్ : 90 కి.మీ/ గంట
- ధర : రూ.79,899 - రూ.90,500
3. TVS NTORQ 125 :ఈ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 అర్బన్ రైడర్లకు చాలా అనువుగా ఉంటుంది. దీని డిజైన్, ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇది మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.8 సీసీ
- మ్యాక్స్ పవర్ : 9.38 PS@ 7000 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.5 Nm@ 5500 rpm
- మైలేజ్ : 47 - 54.33 కి.మీ/ లీటర్
- స్పీడ్ : 90-98 కి.మీ/ గంట
- ధర : రూ.84,636 - రూ.1.05 లక్షలు
4. TVS Jupier : ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్కూటీల్లో టీవీఎస్ జూపిటర్ ఒకటి. ఇది స్మూత్, ఎఫీషియెంట్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఈ స్కూటీ 6 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 109.7 సీసీ
- మ్యాక్స్ పవర్ : 7.88 PS@ 7500 rpm
- మ్యాక్స్ టార్క్ : 8.8 Nm@ 5500 rpm
- మైలేజ్ : 50 కి.మీ/ లీటర్
- స్పీడ్ : 78 కి.మీ/ గంట
- ధర : రూ.73,340 - రూ.89,748
5. Honda Activa 125 :స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ నచ్చే బెస్ట్ స్కూటీ హోండా యాక్టివా 125. తక్కువ ధరలో మంచి టూ-వీలర్ కొనాలని ఆశించేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఇది మొత్తం 4 వేరియంట్లలో లభిస్తుంది.
- ఇంజిన్ : 124.0 సీసీ
- మ్యాక్స్ పవర్ : 8.30 PS@ 6250 rpm
- మ్యాక్స్ టార్క్ : 10.4 Nm@ 5000 rpm
- మైలేజ్ : 60 కి.మీ/ లీటర్
- స్పీడ్ : 90 కి.మీ/ గంట
- ధర : రూ.79,806 - రూ.88,979