SBI Q4 Results 2024: ప్రభుత్వ రంగ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక ఫలితాలను(Q4) ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 21,384 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 18,093.84 కోట్ల నికర లాభంతో పోలిస్తే 18.18శాతం వృద్ధిని నమోదు చేసింది.
SBI Consolidated net profit: 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభం 20.55 శాతం పెరిగి రూ. 67,084.67 కోట్లకు చేరింది. అదే గతేడాలో రూ. 55,648.17 కోట్లుగా ఉంది. నాలుగో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 1.06 లక్షల కోట్ల నుంచి రూ. 1.28 లక్షల కోట్లకు పెరిగింది. అయితే నిర్వహణ ఖర్చులు రూ.29,732 కోట్లతో పోలిస్తే రూ. 30,276 కోట్లకు చేరాయి. మొత్తం కేటాయింపులు గతేడాది కాలంలో రూ.3,315 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ.1,609 కోట్లకు చేరుకున్నాయి.
SBI Non performing Assets (NPA) :ఎస్బీఐ స్థూల నిరర్ధక ఆస్తులు( Gross-NPA) 2024 మార్చి 31 నాటికి 2.24 శాతానికి తగ్గాయి. గతేడాది ఎన్పీఏలు 2.78శాతంగా ఉన్నాయి. డిసెంబర్లో 2.42శాతంగా ఉన్నాయి. ఇక ఎస్బీఐ షేర్లు బీఎస్ఈలో 1.81శాతం పెరిగి రూ.825.10 వద్ద ట్రేడవుతోంది.