Reliance Jio Down :భారతదేశం అంతటారిలయన్స్ జియో సర్వీస్ డౌన్ అయ్యింది. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్కు తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. దీనితో యూజర్లు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్‌చాట్, యూట్యూబ్‌లను యాక్సెస్ చేయలేకపోతున్నారు. గూగుల్ సెర్చ్ కూడా చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు మొబైల్ ఇంటర్నెట్ అంతరాయానికి సంబంధించి 54 శాతం, జియో ఫైబర్‌కు సంబంధించి 38 శాతం ఫిర్యాదులు నమోదు అయ్యాయని సమాచారం.
నో కస్టమర్ కేర్
మంగళవారం దేశవ్యాప్తంగా జియో టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు, జియో ఫైబర్ సేవలు కూడా నిలిచిపోయాయి. దీనితో యూజర్లు సోషల్ మీడియాలో భారీగా పోస్టులు పెడుతున్నారు. డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, జియో ఫైబర్, మొబైల్ నెట్‌వర్క్ యూజర్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. దీనికి గల కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై జియో కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసినా, సరిగా స్పందించడం లేదంటూ పలువురు యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తరచూ ఇలానే జరుగుతోంది!
ఇటీవలి కాలంలో జియో సేవల్లో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. యూజర్లు ఇంటర్నెట్ను యాక్సెస్ చేయలేక, ఉద్యోగ సంబంధమైన విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఫైబర్, మొబైల్ ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయి.