తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం- EMI భారం యథాతథం!

RBI Monetary Policy : రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

RBI Monetary Policy
RBI Monetary Policy

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 10:16 AM IST

Updated : Feb 8, 2024, 11:15 AM IST

RBI Monetary Policy :కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని దాస్‌ తెలిపారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధి అయిన నాలుగు శాతం లోపునకు తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పులేదన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.

గత ఏప్రిల్​ నుంచి రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగిస్తూ వస్తుంది. కాగా, రెపో రేటును ఆర్​బీఐ యథాతథంగా కొనసాగించడం ఇది ఆరోసారి. గతవారం కేంద్రం మధ్యంతర బడ్జెట్​ (2024-25) ప్రవేశపెట్టిన తర్వాత ఆర్​బీఐ ప్రకటించిన తొలి ద్వైమాసిక విధానం ఇదే.

ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలు

  • ఆహార ధరలపై ఒత్తిళ్లను ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎప్పటికప్పుడు క్షుణ్నంగా పర్యవేక్షిస్తుంది.
  • దేశ ఆర్థిక కార్యకలాపాల్లోని జోరు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది.
  • మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతు వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయి.
  • పట్టణాల్లో వినిమయం బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ క్రమంగా పుంజుకుంటోంది.
  • 2024-25కు జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం, 2024-25లో 4.5 శాతంగా అంచనా.
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి. తద్వారా ముడి చమురు వంటి కమొడిటీ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
  • 2023-24లో భారత కరెన్సీ రూపాయి స్వల్ప ఒడిదొడుకులను చవిచూసింది. మారకపు విలువ స్థిరంగా కొనసాగుతోంది.
  • అత్యధిక రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా భారత్‌ కొనసాగుతోంది.
  • భారత విదేశీ మారక నిల్వలు 622.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
  • ఇకపై అన్ని రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణాలకు 'కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌' తప్పనిసరి. దీన్ని అమలు చేసేందుకు బ్యాంకులకు కొంత గడువు ఇన్వనున్నారు.
  • డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పెంపొందించడానికి, అటువంటి లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని ప్రతిపాదన.
  • ఆఫ్‌లైన్‌లోనూ రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పనిచేసేలా చర్యలు.

తగ్గిన గోల్డ్ రేట్​- ఏపీ, తెలంగాణలో ఎలా ఉన్నాయంటే?

ఫిక్స్​డ్ డిపాజిట్​ చేస్తున్నారా?- ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తుందంటే?

Last Updated : Feb 8, 2024, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details