తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.1500 పెట్టుబడితో చేతికి రూ.5లక్షలు - అద్దిరిపోయే స్కీమ్​ - మీకు తెలుసా? - Public Provident Fund Scheme - PUBLIC PROVIDENT FUND SCHEME

PPF Scheme: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని అందరికీ ఉంటుంది. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ లిస్టులో ఓ సూపర్ పథకం కూడా ఉంది. తక్కువ ఇన్వెస్ట్​ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందే ఆ స్కీమ్​ గురించి ఇప్పుడు చూద్దాం.

PPF Scheme
PPF Scheme (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 3:04 PM IST

Public Provident Fund Scheme Details:సంపాదించిన సొమ్ములో కొద్దిమేర పొదుపు చేస్తే.. భవిష్యత్తు అవసరాలకు లోటుండదు. అందుకే చాలా మంది సేవింగ్స్​ చేసేందుకు ఇంట్రస్ట్​ చూపిస్తుంటారు. అయితే.. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో లాభాలు వస్తాయి. కానీ రిస్క్ ఎక్కువ. రిస్క్ లేకుండా భద్రతతో కూడుకున్న రిటర్న్స్ కావాలంటే.. గవర్నమెంట్​ పథకాలు బెస్ట్​. అందుకే చాలా మంది వీటిని ఎంచుకుంటుంటారు. అలాంటి గ్యారెంటీ కలిగిన స్కీమ్స్​లో పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​ ఒకటి. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టొచ్చు. ఇందులో నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ ముగిసే సమయానికి రూ.5 లక్షలు మీ సొంతం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

బెస్ట్​ స్కీమ్​:పీపీఎఫ్ పథకంలో పెట్టుబడి పెట్టడం అనేది ఒక తెలివైన దీర్ఘకాలిక వ్యూహం అని నిపుణులు అంటుంటారు. ఎందుకంటే దీనిలో మనం చేసే డిపాజిట్లకు ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం లభిస్తుంది. ఈ స్కీంకు కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన భద్రత ఎలాగూ ఉంటుంది. ఈ పెట్టుబడి నుంచి మనకు వచ్చే రాబడిపై ట్యాక్స్ పడదు. రాబడిపై చక్రవడ్డీ ప్రయోజనం కూడా దక్కుతుంది. పీపీఎఫ్‌లో మనం పెట్టే పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది.

ఆ మొత్తంలో ఎంతైనా పెట్టొచ్చు: పీపీఎఫ్ అకౌంట్​లో ఒక సంవత్సరానికి రూ.500 నుంచి మొదలుకొని గరిష్ఠంగా రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టొచ్చు. ఇక దీని మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు. మెచ్యూరిటీ గడువుకు ఒక ఏడాది ముందు అప్లై చేయడం ద్వారా ప్రతీసారీ ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడి కాల వ్యవధిని పొడిగించుకోవచ్చు. 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టకపోతే.. అకౌంట్ ఫ్రీజ్ అయినట్టే. పోస్టాఫీసుతోపాటు, బ్యాంకులో కూడా మీరు పీపీఎఫ్ అకౌంట్​ ఓపెన్​ చేయవచ్చు.

జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? నెలకు రూ.10వేలతో పెట్టుబడులు ప్రారంభించండిలా!

నెలకు రూ.15వందల పెట్టుబడితో భారీ ఆదాయం: ఈ పథకంలో 5 లక్షలు పొందాలంటే.. నెలకు రూ. 1500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.18వేలు జమ అవుతుంది. ఇలా 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మొత్తం రూ. 2,70,000 జమ అవుతుంది. ప్రస్తుతమున్న 7.1 శాతం వడ్డీ రేటుతో చూస్తే.. మీకు ఆదాయంపై 2,18,185 వడ్డీ లభిస్తుంది. జమ అయిన మొత్తంతో పాటు వడ్డీని కలుపుకుంటే.. రూ. 4,88,185 మీ సొంతమవుతుంది. అంటే దాదాపుగా రూ. 5 లక్షలు మీ చేతికి వస్తాయి. అధిక ఆదాయం కోసం ఈ పథకాన్ని మరికొన్ని ఏళ్లు పొడిగించుకోవచ్చు.

అదే 5వేలు అయితే:ప్రతినెలా రూ.5వేలు పీపీఎఫ్ అకౌంటులో పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.60వేలు జమ అవుతాయి. ఈ లెక్కన 15 ఏళ్లలో దాదాపు రూ.9 లక్షలు డిపాజిట్ అవుతాయి. వడ్డీ, చక్రవడ్డీ రూపంలో రూ.7,27,284 ఆదాయం వస్తుంది. ఇవన్నీ కలుపుకుంటే మెచ్యూరిటీ సమయానికి దాదాపు రూ.16.27 లక్షలు వస్తాయి. ఒకవేళ మీరు మీ పెట్టుబడి కాలవ్యవధిని పది సంవత్సరాలు పొడిగిస్తే (మొత్తం 25 సంవత్సరాలు), మీ పీపీఎఫ్ విలువ దాదాపు రూ.42 లక్షలకు చేరుతుంది. ఈ 25 ఏళ్ల వ్యవధిలో మీకు వడ్డీ ద్వారా లభించే ఆదాయం రూ.26 లక్షలకుపైనే ఉంటుంది.

జీవితమంతా హాయిగా గడపాలా? ఏ వయస్సులో ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోండి!

బెస్ట్ స్కీమ్​ - రోజుకు రూ.13 కడితే చాలు - జీవితాంతం నెలకు రూ.5000 పెన్షన్!

రోజూ రూ.417 పెట్టుబడితో - కోటి రూపాయల రాబడి! ఈ స్కీమ్​ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details